ఆ నిర్మాత అలా చేశాడట.. నోరు విప్పిన చాందినీ చౌదరి

తెలుగమ్మాయిలు వెండితెరపై వెలగడమే పెద్ద కష్టం. అలాంటి ఓ అమ్మాయి కష్టపడి వస్తోందంటే.. ఎక్కడో ఎవరొకరు కట్టిపడేస్తుంటారు. కాంట్రాక్ట్ పేరిట అవకాశాలు రాకుండా చేస్తారు. అలా చాందినీ చౌదరి జీవితంలో కొన్ని ఘటనలు జరిగాయి. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమస్ అయిన చాందినీ చౌదరి మెల్లిగా వెండితెరపై చాన్సులు కొట్టేసింది. అలా చాలా కాలం తరువాత మొదటిసారిగా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది.

Chandini Chowdary ABout Her Career starting Problems
Chandini Chowdary ABout Her Career starting Problems

మధురం అనే షార్ట్ ఫిలింతో చాందినీ చౌదరి బాగా ఫేమస్ అయింది. ఆ తరువాత చాందినీకి సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ‘కేటుగాడు’తో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత కొన్ని చిన్న సినిమాల్లో నటించింది. బ్రహ్మోత్సవంలో చిన్న పాత్రను పోషించింది. కానీ ఎప్పుడూ బ్రేక్ రాలేదు. ఈ మధ్య రిలీజైన కలర్ ఫోటో సినిమాతో చాందినీకి గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో చాందినీ ఎదుర్కొన్న కష్టాలను చెప్పింది.

కెరీర్‌ ప్రారంభంలో చాలా మందిలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నానని చాందినీ చౌదరీ నోరు విప్పింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలసి రాలేదని తెలిపింది. అలాంటి సమయంలో కలర్‌ఫొటో మాంచి విజయాన్ని అందించిందని పేర్కొంది. అయితే ఆ సినిమాకు ముందు కొన్ని ప్రాజెక్ట్‌లు తన వద్దకు వచ్చాయని కానీ… అదే సమయంలో ఓ ప్రముఖ నిర్మాత దగ్గర తాను కాంట్రాక్ట్‌లో ఉన్నానని తెలిపింది. దానివల్ల రెండేళ్లపాటు వేరే సినిమాల్లో నటించే అవకాశం లేకుండా పోయిందని అలా ‘కుమారి 21F‌’, ‘పటాస్‌’లో నటించే చాన్స్ మిస్సయ్యాను అని చెప్పుకొచ్చింది.

Advertisement