Unstoppable Season 2 : స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ ఎక్కడ.? ఇప్పుడేం చేస్తోంది.?

NQ Staff - October 13, 2022 / 04:43 PM IST

Unstoppable Season 2 : స్వర్గీయ ఎన్టీయార్ ఆత్మ ఎక్కడ.? ఇప్పుడేం చేస్తోంది.?

Unstoppable Season 2 : ఆత్మఘోష గురించి తరచూ వింటుంటాం.! అది సినిమాలకే పరిమితమేమో.! స్వర్గీయ నందమూరి తారకరామారావు రాజకీయంగా వెన్నుపోటుకు గురయ్యారు. కేవలం అది రాజకీయ వెన్నుపోటు మాత్రమే కాదు, కుటుంబ వెన్నుపోటు కూడా.

లక్ష్మీపార్వతిని చేరదీసి నందమూరి తారక రామారావు పెద్ద తప్పే చేశారని అనుకుందాం.! అలాగని, చివరి రోజుల్లో అత్యంత దీనమైన పరిస్థితిని నందమూరి తారక రామారావు అనుభవిస్తే, ఆయన ఆస్తుల్ని పంచుకున్న కుటుంబ సభ్యులు, ఆయన్ని ఎందుకు చేరదీయలేకపోయారు.?

బాలయ్య టాక్ షో, బావ చంద్రబాబు కోసమే.!

‘ఆహా’ ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ కానున్న అన్‌స్టాపబుల్ కొత్త సీజన్, కొత్త ఎపిసోడ్‌ని తెలుగుదేశం పార్టీ తరఫున చిత్రీకరించిన ఓ పొలిటికల్ అండ్ కమర్షియల్ ప్రకటనగానే చూస్తున్నారు చాలామంది.

‘కాళ్ళు పట్టుకుని బతిమాలినా వినలేదు..’ అని చంద్రబాబు చెప్పడం సహా, చాలా విషయాలు.. ఆనాటి వెన్నుపోటు గాయాన్ని మర్చిపోయేలా చేస్తాయా.? చనిపోయిన ఎన్టీయార్ వచ్చి ‘ఇది తప్పు..’ అని చెప్పే పరిస్థితి లేదు. లక్ష్మీపార్వతి మాటలకూ విలువ లేదు.

బాలకృష్ణ, తన బావ ద్వారా ఏం చెప్పించాలనుకుంటే అదే నిజం ఇప్పుడు. చంద్రబాబు ఏం చెప్పాలనుకున్నారో, అది బాలయ్య ద్వారా చేయిస్తున్నారంతే… అన్నది మెజార్టీ వాదన.

స్వర్గీయ నందమూరి తారక రామారావుని టీడీపీ నుంచి గెంటేశాక, ఇంకా ఆయన వారసత్వమేంటి.? ఆయనతోనే అన్నీ అంతమైపోయాయ్ అంటారాయన అభిమానులు. కానీ, ఎన్టీయార్ ఆత్మ మాత్రం ఘోషిస్తూనే వుంటుంది. అది ఎవరికీ వినిపించదంతే.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us