Chalaki Chanti : చలాకీ చంటికి గుండెపోటు.. ఐసీయూలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు..!
NQ Staff - April 23, 2023 / 12:12 PM IST

Chalaki Chanti : ఈ నడుమ గుండెపోటు సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల దాకా అందరినీ భయపెడుతోంది. ఎప్పుడు ఎవరిని ఇది కబలిస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది. ఇప్పుడు తాజాగా చలాకీ చంటి పరిస్థితి కూడా ఇలాగే మారిపోయింది. ఆయనకు నిన్న రాత్రి సమయంలో తీవ్రమైన గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది.
దాంతో ఆయన్ను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారంట. ఆయనకు గత కొంత కాలంగా అనారోగ్యంగా ఉంటోందని సమాచారం. అందుకే ఆయన పెద్దగా బయట కనిపించట్లేదు. ఇప్పుడు పరిస్థితి విషమించి గుండెపోటుకు దారి తీసినట్టు చెబుతున్నారు డాక్టర్లు.
అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన గతంలో సినిమాల్లో కమెడియన్ గా చేశారు. ఆ తర్వాత జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్నారు. కానీ కొంత కాలంగా ఆయన అటు సినిమాల్లో, ఇటు బుల్లితెరపై ఎక్కడా కనిపించట్లేదు. ఇక ఆయనకు గుండెపోటు వార్త విన్న అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.