చైతూ – సాయి పల్లవి ల ” లవ్ స్టోరీ ” ..శేఖర్ కమ్ముల ఇచ్చిన అప్‌డేట్ తో ఫ్యాన్స్ లో టెన్షన్ ..?

మజిలీ, వెంకీమామ లాంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు అక్కినేని నాగ చైతన్య. ఈ క్రమంలోనే క్లాస్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అన్న సినిమా చేశాడు. ఫిదా బ్యూటి సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా రీసెంట్ గా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయిందని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా మీద భారీగా అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న చైతూ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఆతృతగా ఉన్నాడు.

At last, Sai Pallavi is in a dance drama! Film with Naga Chaitanya titled  'Love Story' | The News Minute

అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే 50 శాతం ఆక్యుపెన్సీతో థియోటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని ప్రభూత్వం అనుమతులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో థియోటర్స్ సిద్దమవుతుండగా డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీ కాబోతున్నాయి. థియోటర్స్ ఓపెన్ అవుతుండటం తో ప్రేక్షకులు కూడా కాస్త ఆసక్తిగానే ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా మెనల్లుడు సాయి ధతం తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా డిసెంబర్ 25 న థియోటర్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

అలాగే ఉప్పెన.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా .. రవితేజ క్రాక్..మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ .. రాం పోతినేని నటించిన రెడ్ …. ఇలా చాలా సినిమాలు థియోటర్స్ రిలీజ్ కోసమే వేయిట్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో నాగ చైతన్య నటించిన లవ్ స్టోరీ ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న టాక్ అక్కినేని ఫ్యాన్స్ ని కంగారు పెడుతుందని అంటున్నారు. ఇంతక ముందు కూడా జీ5.. అలాగే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వారు ఈ సినిమాకి భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని మేకర్స్ లవ్ స్టోరీ ని ఎలా రిలీజ్ చేయబోతున్నారో అప్‌డేట్ ఇస్తే బావుంటుంది అని ఫ్యాన్స్ వేయిట్ చేస్తున్నారట.

Advertisement