CHAITU: ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు.. అక్కినేని ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ అందించ‌నున్న చైతూ

అక్కినేని ఫ్యామిలీలో నాగ చైత‌న్య స్లో అండ్ స్ట‌డీగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టించింది.అందమైన ప్రేమ క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న విడుద‌ల కావ‌ల‌సి ఉంది. కాని కరోనా ప‌రిస్థితుల వ‌ల‌న థియేట‌ర్స్ మూసి ఉండ‌డంతో మూవీని కొన్నాళ్లు వాయిదా వేశారు. ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక తిరిగి విడుద‌ల చేయ‌నున్నారు.

ఇక అక్కినేని హీరో చైతూ న‌టిస్తున్న మ‌రో చిత్రం థ్యాంక్యూ. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల విదేశాల‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించిన విక్ర‌మ్ మ‌రి కొద్ది రోజుల‌లో మిగ‌తా పార్ట్ కూడా పూర్తి చేసి 2021లోనే మూవీని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు హిందీలో ఆమిర్ ఖాన్ చేస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నాడు చైతన్య. ఈ సినిమాను 2021లోనే విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే 2021లో చైతూ మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేయ‌నున్నాడు.