karthikeya Wedding : గ్రాండ్‌గా కార్తికేయ రిసెప్ష‌న్‌.. హాజ‌రైన ప్ర‌ముఖులు

karthikeya Wedding : ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ తన ప్రియురాలు లోహిత మెడలో మూడు ముళ్లు వేసిన సంగ‌తి తెలిసిందే.ఈ వివాహా వేడుక‌కి కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడంతో పెళ్లి మండపం లో కొత్త కళ నెలకొంది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు కార్తికేయ‌. వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది.

Celebs at karthikeya Wedding Reception
Celebs at karthikeya Wedding Reception

పెళ్లి వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, తణికెళ్ల భరణి, అజయ్‌ భూపతి, పాయల్‌ రాజ్‌ పుత్‌ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గ‌త రాత్రి ఈ జంట రిసెప్ష‌న్ వేడుక జ‌రుపుకోగా ఈ కార్య‌క్రమంలో దర్శ‌కుడు అజ‌య్ భూప‌తి, ఆది సాయి కుమార్, రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌రైన‌ట్టు తెలుస్తుంది.

Celebs at karthikeya Wedding Reception
Celebs at karthikeya Wedding Reception

నీట్‌ లో బీటెక్‌ చదువుతున్న రోజుల్లోనే కార్తికేయకు లోహితతో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసిందట. ఈ విషయాన్ని కార్తికేయ స్వయంగా వెల్లడించారు..అయితే చదువు తర్వాత హీరోగా రాణించాలనే ఉద్దేశంతో కార్తికేయ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. ముందు ప్రేమతో మీ కార్తిక్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు.

Celebs at karthikeya Wedding Reception
Celebs at karthikeya Wedding Reception

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కార్తికేయ. ఇటీవల ఆయన నటించిన ‘రాజా విక్రమార్క’ రిలీజ్ అయింది. మరో పక్క తమిళ స్టార్ హీరో అజిత్‌ హీరోగా నటించిన ‘వలిమై’ చిత్రంలో కార్తికేయ నెగటివ్ రోల్‌ పోషించారు.

Celebs at karthikeya Wedding Reception
Celebs at karthikeya Wedding Reception

రాజా విక్రమార్క ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా త‌న‌కు కాబోయే భార్య‌ని స్టేజ్ మీదనే ప‌రిచ‌యం చేసి ఆశ్చర్యపరిచాడు. ‘నా జీవితంలో హీరో కావడానికి ఎంత కష్టపడ్డానో అంత కష్టపడి ఓ అమ్మాయిని ప్రేమించి ఒప్పించుకున్నానని వెల్లడించారు, అప్పుడే తనకి నేను హీరో అవుదామని అనుకుంటున్నానని చెప్పి, హీరో అయ్యాక మీ ఇంట్లో వచ్చి అడుగుతా’నని చెప్పానని అలా నేను హీరో అయి చివరికి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నానని వెల్లడించారు.