Celebrities: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సెలబ్స్ మాస్క్ వీడియో

Celebrities: కరోనా మహమ్మారి ప్రస్తుత సమయంలో అందర్ని బలహీనుల్ని చేస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. కరోనాతో పోరాడుతున్నాం. ఈ నేపథ్యంలో ఎంతో మంది సెలెబ్రిటీలు వారికి తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. మరికొంతమంది మాస్క్, శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించడంపై పలు వీడియోలు, సందేశాలు ఇస్తున్నారు. సోనూసూద్, చిరంజీవి, ఇంకా ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల్లో కరోనా పై అవగాహన క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ సందేశాత్మక వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అది కూడా ఫన్నీ ఎలిమెంట్ తో వీడియో తీసి శభాష్ అనిపించుకుంటున్నారు.

Celebrities

కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలామందిలో నిర్లక్ష్యం పెరిగింది. రద్ధీ స్థలాల్లో ఆఫీసుల్లో జనం మాస్క్ ను ఎలా ధరిస్తున్నారు? ఏంటి? అనే వాటిపై, అలాగే కాస్త ఏమరుపాటుగా ఉన్నా కరోనా ఎలా ఎఫెక్ట్ చేస్తుందనే దానిపై అవగాహన కల్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్. ఇలా మాస్క్ వేసుకోవడాన్ని బ్రేక్ చేస్తే కోవిడ్ రాకుండా ఉంటుందా అంటూ సెకండ్ వేవ్ విలయంలో ఏమాత్రం ఛాన్స్ ఇచ్చినా కోవిడ్ వెంటపడి మరీ థర్డ్ వేవ్ లో కబళిస్తుంది. అలాంటి వాళ్ళ కోసమే కన్నువిప్పు కలిగించేందుకు వరలక్ష్మీ శరత్ కుమార్, తన టీమ్ తో ఈ ప్రయత్నం అభినందనీయం అంటున్నారు నెటిజన్లు.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ.. అద్భుతమైన ఈ వీడియో.. నేను అడిగిన వెంటనే చేసినందుకు ధన్యవాదాలు అంటూ, మా నుండి మీకు ఏదో సరదాగా ఇవ్వాలని, మాస్క్ ఎలా ధరించాలి అనే కాన్సెప్ట్ ను చేశాం.. మీరందరూ ఈ వీడియోను చూసి కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక ఈ వీడియోలో తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో పాటు రెజీనా కాసాండ్రా, విద్యూరామన్, హీరో సందీప్ కిషన్, యాక్టర్ కృష్ట, సతీష్, కమెడియన్ ప్రియదర్శి తదితరులు ఉన్నారు.