ఎన్నిక‌ల బ‌రిలో సినిమా సెల‌బ్రిటీలు.. గెలిచిందెవ‌రు, ఓడిందెవ‌రు?

గ‌త కొన్ని రోజులుగా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్స్ రానే వ‌చ్చాయి. మే 2న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నికల హడావిడి నడిచింది. ఫలితాలు వెలువడటంతో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడిపోయారు అనే విషయం తెలుసుకోడానికి ప్రజలు కూడా ఆతృతగా వేచి చూసారు. తమిళనాడు, కేరళ, అసోం, బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందులో చాలా మంది సినిమా వాళ్లు కూడా పోటీలో ఉన్నారు. ముఖ్యంగా తమిళనాట అయితే ఏకంగా ఓ పార్టీ పెట్టి మరీ బరిలోకి దిగాడు కమల్ హాసన్. ఆయనతో పాటు మరికొందరు కూడా ఈ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. మరి వాళ్లలో ఎంతమంది గెలిచారు.. ఎంతమంది ఓడారు అనేది చూద్దాం.

తమిళనాడు:
కమల్ హాసన్: మక్కల్ నీది మయ్యం
పోటీ చేసిన స్థానం: కోయంబత్తూర్, ఫలితం: ఓటమి

ఉదయనిధి స్టాలిన్: డిఎంకే
పోటీ చేసిన స్థానం: చేపాక్, ఫలితం: గెలుపు

కుష్బూ సుందర్: బిజేపీ
పోటీ చేసిన స్థానం: థౌజెండ్ లైట్స్, ఫలితం: ఓటమి

కేరళ:
సురేష్ గోపీ: బిజేపీ
పోటీ చేసిన స్థానం: త్రిసూరు, ఫలితం: ఓటమి

పశ్చిమ బెంగాల్:
సయంతిక బెనర్జీ: టిఎంసి
పోటీ చేసిన స్థానం: బనాకురా, ఫలితం: ఓటమి

యశ్ దాస్ గుప్తా: బిజేపీ
పోటీ చేసిన స్థానం: చండీలా, ఫలితం: ఓటమి

సినిమా వాళ్ల‌ను వెండితెర‌పై మాత్ర‌మే ప్రేమిస్తార‌ని, రియ‌ల్ లైఫ్‌కి వ‌చ్చే స‌రికి వారి ఆలోచ‌న ధోర‌ణి మ‌రోలా ఉంటుందని నిరూపించారు ప్ర‌జ‌లు. తాజా ఎన్నిక‌ల రిజ‌ల్ట్స్‌లో క‌మ‌ల్ హాస‌న్ లాంటి పాపుల‌ర్ న‌టుడు ఓడిపోవ‌డం అంద‌రికి షాక్‌ను క‌లిగిస్తుంది. న‌టుడిగా అశేష ఆద‌ర‌ణ ద‌క్కించుకున్న క‌మ‌ల్‌కు రాజ‌కీయ నాయ‌కుడిగా ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్ట‌ద‌ల‌చుకోలేదు.

Advertisement