Adipurush: ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్‌డేట్‌.. ఫ్యాన్స్ బీ రెడీ

సినీ ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ప్రాజెక్ట్స్‌లో ఆదిపురుష్ ఒక‌టి. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. ఇందులోప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండగా, ఆయ‌న స‌ర‌స‌న సీత పాత్ర‌లో కృతి సన‌న్ న‌టిస్తుంది. సైఫ్ అలీఖాన్ లంకేయుడిగా కనిపించనున్నారు. సన్నీసింగ్ లక్ష్మణుడిగా అల‌రించ‌నున్నాడు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండ‌గా, మూవీకి సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

బుధవారం శ్రీరామ న‌వ‌మిని పుర‌స్క‌రించుకొని మేక‌ర్స్ ఆదిపురుష్ నుండి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఉద‌యం 7గంటల11నిమిషాలకు ఈ సర్‌ ప్రైజ్‌ ని రివీల్‌ చేస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సినిమాను మ‌రో లెవ‌ల్‌లో తీసుకెళ్ల‌డానికి న‌టీన‌టులు కూడా చాలా క‌ష్ట‌ప‌డుతున్నారుజ కృతి స‌న‌న్ అయితే ఓ ట్యూట‌ర్‌ని నియ‌మించుకొని తెలుగులో శిక్ష‌ణ పొందుతుంది. అలానే సీత పాత్ర‌లో ఒదిగిపోయేందుకు ఫుడ్ విష‌యంలోను కొన్ని కండీష‌న్స్ పెట్టుకుంది. ఆదిపురుష్ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు.

Advertisement