Catherine Tresa : పెళ్ళికి తొందరమేంది.? హీరోయిన్ కేథరీన్ అలా అనేసిందేంటీ.!

NQ Staff - December 4, 2022 / 01:39 PM IST

Catherine Tresa : పెళ్ళికి తొందరమేంది.? హీరోయిన్ కేథరీన్ అలా అనేసిందేంటీ.!

Catherine Tresa : కేథరీన్ ట్రెసా.. పెళ్ళీడు దాటేసినా, అప్పుడే పెళ్ళేంటి.? అంటోంది. అసలు కేథరీన్‌ని అవకాశాలు అలా వెతుక్కుంటూ ఎలా వెళతాయి.? అన్నదానిపై చాలామందికి చాలా డౌట్స్ వున్నాయ్. లక్కు తోక తొక్కిందామె. అందుకే, కెరీర్‌లో ఫ్లాపులు ఎదురైనా, అవకాశాలకు మాత్రం లోటుండదు.

మొన్నీమధ్యనే ‘బింబిసార’లో సందడి చేసిన ఈ బ్యూటీ, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో సందడి చేయడానికి సిద్ధంగా వుంది.

దేనికైనా రెడీ..

స్పెషల్ సాంగ్ అయినా నో ప్రోబ్లమ్.. చిన్న పాత్ర అయినా ఇబ్బంది లేదు.. బహుశా అందుకే నాకు అవకాశాలు ఎప్పుడూ వస్తుంటాయేమో.. అని చెబుతుంటుంది కేథరీన్ ట్రెసా.

చిన్న పాత్రల్లో నటించినా, ఐటమ్ సాంగ్స్‌లో డాన్స్ చేసినా.. ఏదైనా నటనే కదా అని చెప్పే కేథరీన్, పెళ్ళెప్పుడు.? అన్న ప్రశ్నకు మాత్రం ‘అప్పుడే కాదు..’ అని సమాధానమిచ్చింది. ఫుడ్ బాగా తింటుందట.. అన్నీ ఇష్టంగానే తింటుందట. తగినంత వ్యాయామం చేయడం వల్లే ఫిట్‌గా వుంటానన్నది కేథరీన్ చెప్పేమాట.

సెన్సాఫ్ హ్యూమర్ తగినంత హైట్, కొంచెం అందం.. వీటితో పాటు తిండి పట్ల తనలాంటి ఇష్టాలు కలిగి వున్నవాడ్ని పెళ్ళాడతానని తాజాగా ఓ సందర్భంలో కేథరీన్ చెప్పుకొచ్చింది. అయితే, పెళ్ళికి ఇంకో ఐదేళ్ళ సమయం వుందని కేథరీన్ చెప్పడం గమనార్హం.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us