Catherine Tresa : వాల్తేరు వీరయ్య లో ఆమె ఉందా లేదా అనే అనుమానాలకు సమాధానం ఇదే
NQ Staff - January 8, 2023 / 11:14 PM IST

Catherine Tresa : మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటించిన ఇక కీలక పాత్రలో ఈ సినిమాలో కేథరిన్ తెర్సా నటిస్తున్నట్లుగా మొదట వార్తలు వచ్చాయి.
కానీ ఒక్క పాటలో కనిపించక పోవడంతో పాటు టీజర్ లో లేదా పోస్టర్లు కేథరిన్ లేక పోవడంతో ఆమె పాత్రను తొలగించి ఉంటారు అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఆచార్య సినిమా లో కాజల్ పాత్ర ను ఎలా అయితే షూటింగ్ తర్వాత తొలగించారో అలాగే ఈ సినిమా నుండి కేథరిన్ పాత్ర ను తొలగించి ఉంటారు అని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయం లో ట్రైలర్ లో చిన్న షాట్ లో ఆమె కనిపించింది, తాజాగా వైజాగ్ లో జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేసింది. దాంతో చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలో కేథరిన్ కనిపించబోతున్నట్లుగా క్లారిటీ వచ్చేసింది.
సంక్రాంతి కానుకగా జనవరి 13వ తారీఖున ఈ సినిమా ను భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను బాబి దర్శకత్వం లో నిర్మించారు.