Prabhas: ప్ర‌భాస్ ప్రొడ్యూస‌ర్‌పై రేప్ కేసు.. విచారిస్తున్న పోలీసులు

Prabhas: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ తెర‌కెక్కించిన చిత్రం రాధేశ్యామ్. ఈ సినిమా నిర్మాత‌ల‌లో ఒక‌రైన భూష‌ణ్ కుమార్‌పై తాజాగా కేసు న‌మోదైంది. ఆయ‌న ఓ మ‌హిళ‌ను మూడేళ్లుగా అత్యాచారం చేశాడ‌ని, ఆమెను వేర్వేరు ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లి వేధింపుల‌కు గురి చేసాడ‌ని భాదితురాలు తెలియ‌జేసింది. 30 ఏళ్ల మ‌హిళ దివంగత గీత రచయిత గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ముంబై పోలీసుల స‌మాచారం ప్ర‌కారం 2017 నుండి 2020 ఆగస్టు వరకు భూషణ్ కుమార్ 30 ఏళ్ల మ‌హిళ‌ను అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్స్‌లో ఛాన్స్ ఇస్తాన‌ని మాయ‌మాట‌లు చెప్పి అత్యాచారం చేశాడ‌ని, ఆ త‌ర్వాత వేధింపుల‌కి కూడా గురి చేశాడ‌ని చెప్పుకొచ్చారు. తన ఫోటో, వీడియో వైరల్ చేస్తామని నిందితుడు బెదిరించాడని బాధితురాలు ఆరోపించింది. దీనిపై ముంబైలోని అంధేరికి చెందిన డిఎన్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

గతంలో మీటూ ఉద్యమం ద్వారా మోడల్ మెరీనా కున్వర్ కూడా భూషణ్ కుమార్ శారీరక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మెరీనా కున్వర్ ఓ టీవి ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో భూషన్ ఒక రోజు తనను కలవడానికి ప్రయత్నించారని చెప్పారు. త‌ప్పుడు ప‌నులు కూడా చేసేందుకు ప్ర‌య‌త్నించాడని, ఆమె కాల్ వివ‌రాల‌ను కూడా సాక్ష్యంగా చూపిస్తాన‌ని పేర్కొంది. అయితే ఈ ఆరోప‌ణ‌ల‌పై అప్పుడు స్పందించిన భూష‌ణ్ కుమార్ ప‌బ్లిసిటీ కోస‌మే ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు.

1997 లో తన తండ్రి గుల్షన్ కుమార్ హత్యానంతరం భూషణ్ కుమార్ టీ సిరీస్ బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. ఇక 2001 లో తుమ్ బిన్ తో చిత్రనిర్మాణంలోకి అడుగుపెట్టి పలు విజయవంతైన చిత్రాలు నిర్మించాడు. భూషణ్ కుమార్ 2005 పిబ్రవరి 13న నటి దివ్యా ఖోస్లాను వివాహం చేసుకున్నారు. వీరికిరూహన్ కుమార్ అనే కొడుకు ఉన్నాడు.

అయితే భూష‌ణ్ కుమార్ పై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్ర‌కారం ఆయ‌న‌పై ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ ప్ర‌కారం 376,420,506 చ‌ట్టం కింద పోలీసులు కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలుస్తుంది.ఇప్ప‌టికీ ఆయ‌న‌ను అదుపులోకి తీసుకోక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం.