Siddharth: సిద్ధార్థ్‌పై కేసు న‌మోదు చేసిన హైద‌రాబాద్ సైబ‌ర్‌క్రైమ్ పోలీసులు

Siddharth: సిద్ధార్థ్ ఇటీవ‌ల న‌టుడిగా కంటే వివాదాస్ప‌ద కామెంట్స్‌తో ఎక్కువ‌గా వార్త‌ల‌లో నిలుస్తూ వ‌స్తున్నాడు. ప్ర‌ముఖ భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రధానమంత్రి మోడీ పంజాబ్ పర్యటనపై చేసిన ట్వీట్ పై హీరో సిద్ధార్థ్ .. సబ్టిల్ కాక్ ఛాంపియన్ ఆఫ్ వరల్డ్…అంటూ సైనా పై కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్ చేశాడు. అత‌ను చేసిన కామెంట్స్‌పై ప‌లువురు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Case Booked on Actor Siddharth
Case Booked on Actor Siddharth

కేంద్ర మంత్రి, చిన్మయి, సైనా తండ్రి, సైనా నెహ్వాల్ భర్త, బ్యాడ్మింటన్ ప్లేయర్ పారుపల్లి కశ్యప్ సహా పలురువు సోషల్ మీడియా వేదికగా సిద్ధార్ద్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. తమ నిరసన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ తను చేసిన ట్వీట్ ద్వారా ఎవరిని అగౌరవపరిచ లేదు అంటూ వివరించే ప్రయత్నం చేశారు. తాజాగా నటుడు సిద్ధార్ద్ ట్విట్టర్ వేదికగా తను పెట్టిన కామెంట్స్ పై మళ్ళీ స్పందించారు.

బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్ధ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. సైనా పెట్టిన ట్వీట్ మీద తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమే నని వివరణ ఇచ్చారు. అయితే తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని అన్నారు. అయితే తనకు మహిళలను కించపరుస్తూ కామెంట్స్ చేయాలనే ఉద్దేశ్యం తనది కాదంటూ వివరణ ఇచ్చారు.

సైనా నెహ్వాల్ ఎప్పుడు ఒక గొప్ప క్రీడాకారిణి అని.. తాను ఆమెను గౌరవిస్తానని అన్నారు. అంతేకాదు తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని.. కనుక అలాంటి తాను పోస్ట్ చేసిన కామెంట్స్ పై క్షమాపణ కోరుతున్నానని అన్నారు నటుడు సిద్ధార్ధ్. అయితే ఒలింపిక్ కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్‌పై ట్విట్టర్‌లో అవమానకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నటుడు సిద్ధార్థ్‌పై కేసు నమోదైంది.

Case Booked on Actor Siddharth
Case Booked on Actor Siddharth

ప్రేర‌ణ‌ ఫిర్యాదు మేరకు ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 509, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67 కింద కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు సిద్ధార్థ్‌పై రెండు ఫిర్యాదులు స్వీకరించారు. ఒక ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు సిద్ధార్థ్ వివాదం ఇంకెంత ర‌చ్చ‌గా మారుతుందో చూడాలి.