సినీ ఫ‌క్కీలో ప్రముఖ సినీ నిర్మాత కారు చోరీ.. రంగంలోకి పోలీసులు

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియడం కాస్త కస్టమే.. అయితే రీసెంట్ గా ఓ ప్రముఖ కన్నడ నిర్మాత తన ఖరీదైన కారుని పోగొట్టుకున్నారు. అది ఎక్కోడో కన్నడ స్టేట్ లో కాదు.. హైదరాబాద్ లో ఓ పనిమీద వచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత వి మంజునాధ్ బంజారాహిల్స్ లో పార్క్ హయత్ అనే హోటల్ కి చేరుకున్నాడు. మంజునాథ్ ని హోటల్ దగ్గర దింపిన డ్రైవర్.. కారుని హోటల్ బేస్ మెంట్ 2 లో పార్క్ చేశారు. సిల్వర్ కలర్ ఎస్ యూవీ వాహనం కోసం నెక్ట్స్ డే డ్రైవర్ బేస్ మెంట్ కి వెళ్ళారు. అయితే అక్కడ తాను పార్క్ చేసిన చోట కారు కనిపించలేదని.. దీంతో కారుకోసం పార్కింగ్ ఏరియాలో సెక్యూరిటీతో కలిసి డ్రైవర్ హర్ష వెతకడం ప్రారంభించారు. అక్కడున్న సిబ్బందితో పాటు వెతికినా.. ప్రయోజనం లేక వెంటనే మంజునాథ్ కు సమచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మంజునాథ్ కూడా డ్రైవర్ తో కలిసి కారు వెతికినా.. ప్రయోజనం లేకపోయింది. దీంతో వెంటనే మంజునాథ్ పోలీసులకు కారు గురించి కంప్లైంట్ చేశారు.

ఓ హోటల్ లో బస చేసిన తాను కారు పోగొట్టుకున్నానని.. అది కనిపించడం లేదని.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఆ కారులో నాలుగు చెక్ బుక్ లు.. లైసెన్స్ వెపన్ డాక్యూమెంట్స్ తో పాటు బంగారు వినాయకుడి విగ్రహం కూడా ఉందని.. ల్యాండ్ డాక్యూమెంట్స్ సహా మరికొన్ని విలువైన వస్తువులున్నాయని మంజునాథ్ కంప్లైంట్ లో తెలిపారు.

ఇక తమ పని చేపట్టిన పోలీసులు కారును కనిపెట్టడానికి స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు హోటల్ కు సంబంధించిన సీసీటీవీని.. సెక్యూరిటీని సంప్రదించి, వివరాలు సేకరించారు. అయితే హై సెక్యూరిటీతో పాటు పక్కా సీసీ కెమెరాలతో ఉండే పేరున్న హోటల్ నుండి ఓ ఖరీదైన కారు పోవడం వెనుక పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Advertisement