Captain Movie Review : కెప్టెన్ రివ్యూ: జస్ట్ థంబ్స్ డౌన్..
NQ Staff - September 8, 2022 / 02:49 PM IST

Captain Movie Review : ప్రముఖ తమిళ నటుడు ఆర్య నటించిన ‘కెప్టెన్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. శక్తి సౌందర రాజన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. సినిమాపై ప్రీ రిలీజ్ హైప్ బాగా క్రియేట్ అయ్యింది. ప్రమోషన్స్ ఆకట్టుకున్నాయి. దాంతో, తమిళ వెర్షన్‌తోపాటుగా తెలుగులోనూ ఈ సినిమాపై ఒకింత ఆసక్తి బాగానే నెలకొంది. సినిమా ఎలా వుంది.? కథా కమామిషు ఏంటి.? వంటి వాటి గురించి తెలుసుకుందాం పదండిక..

Captain Movie Review
కథ:
ఆర్మీ బేస్ క్యాంప్ బ్యాక్‌డ్రాప్‌లో కథ నడుస్తుంటుంది. ఓ వింత జీవి కారణంగా చిత్ర విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. హిమాలయ ప్రాంతంలోని సెక్టార్ 42లో జరుగుతున్న మిస్టీరియస్ పరిణామాల్ని ఛేదించేందుకు విజయ్ కుమార్ (ఆర్య) నేతృత్వంలోని ఓ బృందం రంగంలోకి దిగుతుంది. సెక్టార్ 42 వెనుక అసలు కథ ఏంటి.? ఆ మిస్టరీని విజయ్ కుమార్ టీమ్ ఛేదించిందా.? లేదా.? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పని తీరు..
హీరో ఆర్య చాలా బాగా చేశాడు. ఈ తరహా ఇంటెన్సిటీ వున్న పాత్రలు అతనికి కొట్టిన పిండి. ఆర్మీ అదకారి పాత్రలో ఒదగిపోయాడాయన. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఈ సినిమాలో సైంటిస్ట్‌గా కనిపించింది. ఆదిత్ మీనన్ ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెప్పిస్తాడు.
విజయ్ కుమార్ టీమ్‌లో పనిచేసిన సభ్యులు తమ పరిధి మేర బాగా నటించారు. ఐశ్వర్య లక్ష్మి, హరీష్ ఉత్తమన్ ఓకే. కావ్యా శెట్టి లేడీ ఆర్మీ అధికారి పాత్రలో బాగా చేసింది.
సాంకేతిక విభాగమెలా వుందంటే..

Captain Movie Review
మన పర్యావరణంపై మానవాళి చూపుతున్న ప్రభావం గురించి దర్శకుడు శక్తి సౌందర్ రాజన్ తన ఆలోచనల్ని ప్రెజెంట్ చేసే క్రమంలో మంచి బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నా, అడవిలో వింత జీవుల్ని ఈ కథకు ఇంర్‌లింక్ చేయడం కొంత సెట్ అవలేదేమో అనిపిస్తుంది.
సంగీత దర్శకుడు ఇమ్మాన్ నిరాశపరిచాడు. ఒక సిట్యుయేషన్ మాంటేజ్ సాంగ్ మానహా, పెద్దగా అతను ప్రభావం చూపించలేకపోయాడు తన మ్యూజిక్‌తో. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇలాంటి సినిమాలకి వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా కీలకం. కానీ, అస్సలేమీ బాగా చేయలేదు. సినిమాటోగ్రఫీ ఓకే. ఇంకాస్త బెటర్‌గా వుంటే బావుండేది. ఎడిటింగ్ చాలా డల్లుగా వుంది.
ప్లస్ పాయింట్స్..
ఆర్య
మైనస్ పాయింట్స్..
స్క్రీన్ ప్లే, దర్శకత్వం
ఎమోషనల్ కనెక్టివిటీ లేకపోవడం..

Captain Movie Review
విశ్లేషణ
ఓవరాల్‌గా ఇదొక సైంటిఫిక్ ఫిక్షన్ డ్రామా.. మంచి పాయింట్‌తోనే కథ అనుకున్నా, ఎగ్జిక్యూషన్‌లో వుండాల్సిన క్వాలిటీ, స్పీడ్‌నెస్ లేకుండా పోయాయ్. ఆర్య సహా కీలక పాత్రధారులు మంచి నటనతో ఆకట్టుకున్నా, నెరేషన్ వీక్‌గా వుండటంతో సినిమా తేలిపోతుంది. మొత్తంగా చూస్తే కెప్టెన్ జస్ట్ థంబ్స్ డౌన్ అంతే.
Rating: 1.0/5