ఫ్లాపు సినిమాకు ఎందుకింత హడావిడి.. ‘జవాన్’పై దర్శకుడి రచ్చ!

BVS Ravi about Sai Dharam Tej Jawaan Completes 3 years
BVS Ravi about Sai Dharam Tej Jawaan Completes 3 years

ఫ్లాపు సినిమా అని తెలిసి కూడా దాన్ని కళాఖండంగా చెప్పుకోవడం, వాటిని మళ్లీ తలుచుకోవడం, వాటి గురించి గొప్పగా చెప్పుకోవడం కొందరికే చెల్లుతుంది. సాయి ధరమ్ తేజ్ బ్యాడ్ లక్ నడుస్తున్న సమయంలో వచ్చిన డిజాస్టర్ చిత్రాల్లో జవాన్ ఒకటి. దాని దర్శకుడు బీవీఎస్ రవి. నిర్మాత దిల్ రాజు. ఈ సినిమా కోసం ఇంకా స్పెషల్‌గా కన్నడ యాక్టర్ స్నేహా భర్త ప్రసన్నను కూడా తీసుకొచ్చారు.

BVS Ravi about Sai Dharam Tej Jawaan Completes 3 years
BVS Ravi about Sai Dharam Tej Jawaan Completes 3 years

ఎన్ని అదనపు హంగులు అద్దిన అసలు కథలో దమ్ముంటే సినిమా ఆడుతుంది. జవాన్ సినిమాకు అదే మిస్ అయింది. కథను ఏదో చేద్దాం ఎటో తిప్పుదామనుకుని బొక్క బోర్లా పడ్డారు. అలాంటి సినిమా విడుదలై నేటికి మూడేళ్లు అవ్వడంతో సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు దర్శకుడు. డైరెక్టర్ బీవీఎస్ రవి నేటి ఉదయం నుంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాడు. అయితే దర్శకుడిగా మొదటి చిత్రం కావడంతో ఇంకా ప్రేమను చంపుకోలేకపోతున్నాడని తెలుస్తోంది.

ఇక బీవీఎస్ రవికి తగ్గట్టు హరీష్ శంకర్ ఉన్నాడు. ది బెస్ట్ మూవీ అంటూ హరీష్ శంకర్ కితాబిచ్చాడు. మొత్తానికి ఈ సినిమా మూడేళ్లు అయినా కూడా హిట్టైనట్టు ఇంకా భ్రమల్లోనే ఉన్నాడా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వరుసగా డిజాస్టర్లు కొడుతూ వచ్చిన సాయి ధరమ్ తేజ్‌కు చిత్రలహరి ఊపిరి పోసింది. ఆ తరువాత ప్రతిరోజూ పండుగే సినిమాతో సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ఈ మెగా హీరో కరెక్ట్ ట్రాక్‌లోనే ఉన్నాడనిపిస్తోంది. ఇక సోలో బ్రతుకే సో బెటర్ అంటే డిసెంబర్ 25న రాబోతోన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here