Devi Sri Prasad: పుష్ప 2 విష‌యంలో దేవి శ్రీ ప్ర‌సాద్ ఇంత స్పీడుగా ఉన్నాడా.. ఆల్బ‌మ్ అద్దిరిపోవ‌ల్సిందే..!

NQ Staff - February 28, 2022 / 01:04 PM IST

Devi Sri Prasad: పుష్ప 2 విష‌యంలో దేవి శ్రీ ప్ర‌సాద్ ఇంత స్పీడుగా ఉన్నాడా.. ఆల్బ‌మ్ అద్దిరిపోవ‌ల్సిందే..!

Devi Sri Prasad: పుష్ప .. ఇటీవ‌లి కాలంలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రం . ఈ సినిమాలో అల్లు అర్జున్, ర‌ష్మిక ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా సుకుమార్ తెర‌కెక్కించారు. ఈ సినిమాకి వ‌చ్చిన క్రేజ్ మాములుగా లేదు.. పుష్ప’ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు.

Buzz: Devi Sri Prasad Composed 3 Songs for Pushpa 2

Buzz: Devi Sri Prasad Composed 3 Songs for Pushpa 2


క్రికెటర్స్‌తో సహా అందరూ పుష్పలోని ఏదో సీన్‌ను, పాటను, డైలాగును రీల్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఆఖరికి అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌లో కూడా పుష్ప క్రేజ్ తగ్గేదే లే అన్నట్టుగానే ఉంది. పుష్పలోని శ్రీవల్లి పాటకు ఇంగ్లీష్ వర్షన్‌ను పాడింది ఓ డచ్ సింగర్. ఈ ఇంగ్లీష్ వర్షన్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.

పుష్పలోని తగ్గేదే లే డైలాగుకు ఎంత క్రేజ్ ఉందో.. అందులోని శ్రీవల్లి పాటకు కూడా అంతే క్రేజ్ ఉంది. మామూలుగానే సిడ్ శ్రీరామ్ వాయిస్‌లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ శ్రీవల్లి పాటకు బాగా పనిచేసింది. అందుకే సినిమా విడుదలయ్యి నెల దాటిపోయినా.. ఇంకా ఈ పాటను పదే పదే వింటున్న వారు చాలామందే ఉన్నారు. హిందీలో ఈ పాటను జావేద్ అలీ ఆలపించాడు.

పుష్ప తొలి పార్ట్ తెగ ర‌చ్చ చేయ‌గా, రెండో పార్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా సెకండ్ పార్ట్ షూటింగ్ మ‌రి కొద్ది రోజులలో జ‌ర‌గ‌నుండ‌గా, దీని కోసం దేవి శ్రీ ప్ర‌సాద్ ప‌నులు వేగ‌వంతం చేశాడు. పుష్ప 2 కోసం 3 పాటలను కంపోజ్ చేసినట్లు వినికిడి. మిగిలిన పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు దేవిశ్రీ కసరత్తు చేస్తున్నాడు.

పుష్ప 2 చిత్రం మ‌రి కొద్ది రోజులలో షూటింగ్ జ‌రుపుకోనుంది. ఈ సారి పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మూవీ కోసం చాలా కృషి చేస్తున్నారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.

Read Today's Latest గుసగుసలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us