Pushpa : పుష్ప కోసం అంతకు మించి..బన్నీ, సుక్కు, దేవి..!

Pushpa : పుష్ప ..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేశారట. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆగస్టు 13న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద భారీ అంచనాలను పెంచేసింది.

bunny, sukku, devi for pushpa-
bunny, sukku, devi for pushpa-

 

ఇక త్వరలో ఈ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్‌ని షూట్ చేయబోతున్నారట. బన్నీ, సుక్కు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్‌లో ఐటెం సాంగ్ అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్య సినిమాలో అ అంటే అమలాపురం, ఆర్య 2 లో రింగ రింగ ఐటెం సాంగ్ లు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా రింగ రింగ ఐటెం సాంగ్ కేవలం తెలుగు వాళ్ళనే కాదు.. మొత్తం దేశ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది. మళ్ళీ ఈ ముగ్గురు కాంబినేషన్‌లో ఇన్నాళ్ళకి అంతకు మించిన ఐటెం సాంగ్ రాబోతోందట.

Pushpa : పుష్ప సినిమాతో దేవి సత్తా చాటడం ఖాయంటున్నారు.

రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఆ రెండు సాంగ్స్ కంటే మించిన ఐటెం సాంగ్‌ని పుష్ప కోసం రెడీ చేశాడట. ఈ సాంగ్ విన్న సుక్కు అండ్ బన్నీ దేవిని ప్రశంసలతో ముంచేశారట. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఈ సాంగ్ షూట్ చేస్తామో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి ఈ సాంగ్ ఎలాంటి కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. ఇటీవల ఉప్పెన సినిమాతో రాక్ స్టార్ అదిరిపోయే సాంగ్స్ ఇచ్చి మెగాస్టార్ ప్రశంసలు కూడా అందుకున్నాడు. మళ్ళీ పుష్ప సినిమాతో దేవి సత్తా చాటడం ఖాయంటున్నారు.

Advertisement