SALMAN: బ‌న్నీపై ప్ర‌శంస‌లు కురిపించిన స‌ల్మాన్.. కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అల్లు అర్జున్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ .. అల్లు అర్జున్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. స‌ల్మాన్ త‌న తాజా చిత్రం రాధే కోసం అల్లు అర్జున్ న‌టించిన డీజే చిత్రంలోని సీటీమార్ అనే పాట రీమేక్ చేశాడు. ఈ పాట‌కు దేవి శ్రీ ప్ర‌సాద్ బాణీలు స‌మకూర్చారు. తాజాగా బాలీవుడ్ సీటీమార్ పాట విడుద‌ల కాగా, ఈ పాట‌ని త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసిన స‌ల్మాన్ .. సీటీమార్ పాట‌ను అందించినందుకు ధన్య‌వాదాలు అల్లు అర్జున్. ఈ పాట‌లో నీ ప‌ర్‌ఫార్మెన్స్‌, డ్యాన్స్‌, స్టైల్ ఎంతో బాగున్నాయి. మీరు, మీ కుటుంబం జాగ్ర‌త్త‌గా ఉండండి. ల‌వ్ యూ బ్ర‌ద‌ర్ అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు స‌ల్మాన్.

స‌ల్మాన్ ట్వీట్‌పై వెంట‌నే స్పందించారు బ‌న్నీ. థ్యాంక్ యూ సో మచ్ స‌ల్మాన్ ఖాన్ గారు. మీ ద‌గ్గ‌ర నుండి కాంప్లిమెంట్ పొంద‌డం నా అదృష్టం. చాలా ఆనందంగా ఉంది. రాధేతో మీరు మ్యాజిక్ చేస్తార‌ని , అది చూసి ప్ర‌జ‌లు మీ కోసం సీటీమార్ వేస్తార‌ని ఆశిస్తున్నాను. మీ ప్రేమ‌కు నేను ధ‌న్యుడిని అంటూ బ‌న్నీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన చిత్రం ‘రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్‌’ చిత్రాన్ని రంజాన్‌ సందర్భంగా మే నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా నెలకొన్న లాక్‌ డౌన్‌తో సినిమా విడుదల వాయిదా పడింది. కాగా అల్లు అర్జున్‌ ‘ఆర్య 2’ చిత్రంలోని ‘రింగ రింగ..’ పాటని సల్మాన్‌ ఖాన్‌ ‘రెడీ’ చిత్రంలో ‘ధింక చికా…’ అంటూ రీమిక్స్‌ చేయగా ఇప్పుడు సీటీమార్‌ని రాధే కోసం రీమేక్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని రీల్‌ లైఫ్‌ ప్రొడక్షన్స్, సోహైల్‌ ఖాన్‌ ప్రొడక్షన్స్, సల్మాన్‌ ఖాన్‌ ఫిల్మ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

Advertisement