ALLU ARJUN స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప అనే పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్ట్ 13న చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేయగా, మూవీకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. బుధవారం రోజు బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్పరాజ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ పెద్ద ఈవెంట్ ప్లాన్ చేశారు.ఈ వేడుకకు అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలతో పాటు అల్లు శిరీష్, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు.
ఎంతో అట్టహాసంగా జరిగిన పుష్పరాజ్ పరిచయ వేడుకలో బన్నీ చాలా ఉత్సాహంగా కనిపించారు. ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మీరు నా ఫ్యాన్స్ కాదు నా ఆర్మీ. నన్ను ఇంత ప్రేమిస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా బర్త్‌డే గిఫ్ట్ ఈ రేంజ్లో ఉండడం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఆర్యతో నన్ను స్టైలిష్ స్టార్‌గా మార్చిన సుకుమార్ ఇప్పుడు పుష్పతో ఐకాన్ స్టార్‌గా మారుస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఏమి ఉండదు” అని సంతోషం వ్యక్తం చేశారు అల్లు అర్జున్.
పుష్పరాజ్ పరిచయ వేడుక కార్యక్రమానికి భారీగా అభిమానులు హాజరు కాగా, బన్నీని కలిసేందుకు బౌన్సర్స్‌ను నెట్టుకుంటూ ఆయన దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు అభిమానులు. ఫ్యాన్స్‌ని కంట్రోల్ చేయలేక మేనేజ్మెంట్తో పాటు బౌన్సర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. అయితే అభిమానులు తోపులాటలో బన్నీ మొబైల్ పడిపోయిందనే టాక్ వినిపిస్తుంది. ఈవెంట్లోనే బన్నీ మొబైల్ మిస్ అయిందని, అది ఇంకా దొరకలేదని ప్రచారం జరుగుతుంది. దీనిపై బన్నీ టీం నుండి ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇంకా రాలేదు. అయితే అభిమానుల ప్రేమ ముందు తన ఫోన్ పోగొట్టుకున్నా కూడా పెద్దగా బాధపడడు అంటూ పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.