Bunny: నానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బన్నీ.. ఎందుకో తెలుసా?

Bunny: స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మ‌రాడు బ‌న్నీ. పుష్ప సినిమాతో ఆయ‌న‌కు దేశ వ్యాప్తంగా క్రేజ్ లభించింది. బాలీవుడ్ ప్ర‌ముఖులు అయితే అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మ‌నోడు మాత్రం ఈ మ‌ధ్య కాలంలో చాలా మెచ్యూర్డ్, చాలా ప‌ద్ద‌తిగా అంద‌రిని క‌లుపుకుంటూ పోతున్నారు. త‌న సినిమాతో పాటు మిగ‌తా హీరోల సినిమాలు హిట్ కావాల‌ని తెగ తాప‌త్ర‌య‌ప‌డుతున్నాడు.

bunny alolize to nani
bunny alolize to nani

బ‌న్నీ ఈ మ‌ధ్య కాలంలో చాలా సినిమా ఈవెంట్స్ కి హాజ‌ర‌య్యాడు. ఆ సినిమా స‌క్సెస్‌లో స‌గ భాగంగా నిలిచాడు. నిర్మాత దిల్‌రాజు సోదరుడి కుమారుడు ఆశిష్‌రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ `రౌడీబాయ్స్` చిత్రాన్ని రూపొందించారు. అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన `డేట్‌ నైట్` అనే పాటని విడుదల చేశారు అల్లు అర్జున్. దీనికి సంబంధించి ఈవెంట్‌ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు.

గెస్ట్ గా హాజరైన బన్నీ పాట విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, నిర్మాత దిల్‌రాజుతో `ఆర్య` సినిమా నుంచి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తనకు లైఫ్‌ ఇచ్చిందన్నారు. దిల్ రాజు లేకపోతే ఆ సినిమా లేదన్నారు. ఆ సినిమా షూటింగ్‌ టైమ్‌లో ఆశిష్‌, అన్షు చిన్నపిల్లలుగా ఉన్నారని, సెట్‌లో ఆడుకునే వారని తెలిపారు. ఇప్పుడు వారం గొప్పగా ఎదుగుతుంటే ఆనందంగా ఉందన్నారు.

మన ఫ్యామిలీలోని పిల్లలు మంచి స్థానానికి వస్తే ఎలా ఫీల్‌ అవుతామో, ఇప్పుడు తనకు అలాంటి అనందం కలుగుతుందన్నారు. చిత్ర బృందానికి ఆయన అభినందనలు చెప్పారు. సంక్రాంతికి విడుదలయ్యే సినిమాలన్నీ బాగా ఆడాలన్నారు. తెలుగు సినిమా ఆడాలని ఆయన వెల్లడించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న `రౌడీబాయ్స్` విడుదల కానుంది.

అనంతరం బన్నీ.. చెబుతూ ఇటీవల బాగా ఆడిన సినిమాలకు అభినందనలు తెలిపాడు. `అఖండ` అద్భుతంగా ఆడిందని, ఆ తర్వాత `పుష్ప` మంచి ఆదరణ పొందిందన్నారు. `పుష్ప` తర్వాత విడుదలైన నాని `శ్యామ్‌సింగరాయ్‌` చిత్రంపై ప్రశంసలు కురిపించారు. సినిమా టీమ్‌ని అభినందించాలనుకున్నాను, కానీ అవకాశం దొరకలేదు. లాస్ట్ టైమ్‌ ఈవెంట్‌లో చెప్పాలనుకున్నా మర్చిపోయానని తెలిపారు. అందుకు నానికి క్షమాపణలు తెలిపారు బన్నీ.

bunny alolize to nani
bunny alolize to nani

`శ్యామ్‌ సింగరాయ్‌` సినిమా చాలా బాగుంది. నానిగారి నటన, సాయిపల్లవి నటన చాలా బాగుంది. దర్శకుడు సినిమాని తీసిన విధానం అద్భుతంగా ఉంది. ఎవరైనా సినిమాని మిస్‌ అయి ఉంటే ఓటీటీలో వచ్చినప్పుడు కచ్చితంగా చూడండి. అందరికి నచ్చుతుంది. టెక్నికల్‌గా చాలా బాగుంది. అందరికి నచ్చాలని కోరుకుంటున్నా` అని తెలిపారు బన్నీ.