ALLU ARJUN: బ‌న్నీకు పెరుగుతున్న ఫ్యాన్ ఫాలోయింగ్.. త‌క్కువ స‌మయంలోనే 12 మిలియ‌న్ ఫాలోవర్స్

స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ త‌న ఇమేజ్‌ను అంత‌కంత పెంచుకుంటూ పోతున్నాడు. గ‌త ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాతో పెద్ద విజ‌యాన్ని అందుకున్న బన్నీ ప్ర‌స్తుతం పుష్ప అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్ట్‌లుగా రూపొందుతుంది. పుష్ప‌రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో బ‌న్నీ క‌నిపించి అల‌రించ‌నున్నాడు. ఈ ఏడాది పుష్ప తొలి పార్ట్ విడుద‌ల కానుండ‌గా, వ‌చ్చే ఏడాది సెకండ్ పార్ట్ రిలీజ్ కానుంది.

అల్లు అర్జున్ ట్విట్ట‌ర్, ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇటీవ‌ల బ‌న్నీకి కరోనా పాజిటివ్ అని తేల‌డంతో ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలంటూ అభిమానులు, సెల‌బ్రిటీలు తెగ పోస్ట్ లు చేశారు. అంతేకాదు ఆయ‌న ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆరాలు కూడా తీసారు. ఈ క్ర‌మంలోనే ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్స్ సంఖ్య 12 మిలియ‌న్స్ చేరింది. ఇంత ఫాస్ట్‌గా రికార్డ్ అందుకున్న తెలుగు హీరోగా బ‌న్నీ నిలిచాడు. కొద్ది రోజుల క్రితం విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా ఈ ఫీట్ అందుకున్నాడు.