Kiara advani : కియారా అద్వానీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన శంకర్..?

Kiara advani : కియారా అద్వానీ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎంతటి క్రేజ్‌ ఉందో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుంచి ఆఫర్స్ వచ్చినా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా హిందీ సినిమాలు చేస్తోంది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ రెండవ సినిమాని మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. వినయ విధేయ రామ టైటిల్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది.

bumper offer given to kiara-advani by shanker
bumper offer given to kiara-advani by shanker

కానీ బాలీవుడ్‌లో మాత్రం కియారా ఎలాంటి క్యారెక్టర్స్ అయినా ఒప్పేసుకొని వరసగా బ్లాక్ బస్టర్స్ అందుకొని తన సత్తా చాటుతోంది. గత మూడేళ్ళుగా కియారా అద్వానీ బాలీవుడ్‌లో వరసగా భారీ హిట్స్ అందుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారింది. అయితే క్రియేటివ్ జీనియస్ శంకర్ బాలీవుడ్ లో తెరకెక్కించబోతున్న అపరిచితుడు హిందీ రీమేక్ లో కియారాకి అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా పెన్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అపరిచితుడు హిందీ రీమేక్ తెరకెక్కించబోతున్నట్టు అధికారకంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Kiara advani : కియారాకి అవకాశం వస్తే తన రేంజ్ మరో రేంజ్ కి చేరుకుంటుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించబోతున్నాడు. డా.జయంతీలాల్ గడ ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నాడు. 2005లో వచ్చిన తమిళ అన్నియన్ సినిమాలో విక్రం స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న మూడు విభిన్న క్యారెక్టర్స్ లో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఆకట్టుకున్నాడు. అపరిచితుడుగా తెలుగులోనూ డబ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్ళని రాబట్టింది. ఇప్పుడు అంతకంటే భారీ హిట్ హిందీ రీమేక్ తో అందుకోవాలని ట్రై చేస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కియారాకి అవకాశం వస్తే తన రేంజ్ మరో రేంజ్ కి చేరుకుంటుంది.

Advertisement