Rakesh Master: అందరితో మాటలు పడుతున్నాడు.. పరువుతీయించుకుంటున్న రాకేష్ మాస్టర్

Rakesh Master రాకేష్ మాస్టర్ గురించి తెలియని ప్రేక్షకులు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరు. కొరియెగ్రాఫర్ అని కొంత మందికే తెలిసినా కూడా యూట్యూబ్ ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. టాలీవుడ్ హీరోలు, టాలీవుడ్ ఇండస్ట్రీ, ఫ్యామిలీ హీరోల మీద నానా రకాల కామెంట్లు చేసి ఫేమస్ అయ్యాడు. హీరోలను బండ బూతులు తిట్టడం, వాటిపై వారి వారి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అవి చిలికి చిలికి గాలి వానల మారడంతో రాకేష్ మాస్టర్ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

మొత్తానికి రాకేష్ మాస్టర్ యూట్యూబ్ స్టార్ అయ్యాడు. అలా యూట్యూబ్‌లో వచ్చిన క్రేజ్ బుల్లితెర వరకు తీసుకొచ్చింది. బుల్లితెరపై స్టార్ మా, ఈటీవీ వినోద కార్యక్రమాల్లో గెస్ట్‌గా వస్తుంటాడు. అక్కడా తన దైన శైలిలో పంచ్‌లు వేస్తూ అందరినీ ఆడుకుంటాడు. కానీ జబర్దస్త్ షోలో మాత్రం రాకేష్ మాస్టర్ మీదే పంచ్‌లు వేసి పరువుతీస్తుంటారు. బుల్లెట్ భాస్కర్ , నరేష్ ఇద్దరూ కలిసి రాకేష్ మాస్టర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకుంటారు.

పరువుతీయించుకుంటున్న రాకేష్ మాస్టర్

తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో రాకేష్ మాస్టర్ పరువుతీసేశారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం అంటూ ఆ జుట్టును గేలిచేశారు. ఆ తరువాత నూడుల్స్ చేసే వాడిలా ఉన్నాడంటూ నరేష్ కౌంటర్ వేశాడు. గిలక పిలక అంటూ మరోసారి రాకేష్ మాస్టర్ మీద సెటైర్ వేశాడు. మొత్తానికి రాకేష్ మాస్టర్ కూడా తన మీద పంచ్‌లు వేయించుకోవడం అలవాటు చేసుకున్నట్టున్నాడు. ఇక రాకేష్ మాస్టర్ జబర్దస్త్ షోలో బాగానే సెటిల్ అయ్యాడు.

అయితే యూట్యూబ్‌లో రాకేష్ మాస్టర్ ఇంటర్వ్యూలు చూస్తే ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంటాడు. ఎదుటివారిని మాట్లాడనివ్వకుండా రెచ్చిపోతుంటాడు. తనను ఒక్క మాట అన్నా కూడా రివర్స్‌లో బండ బూతులు తిడుతుంటాడు. కానీ తెర మీదకు వచ్చే సరికి స్క్రిప్ట్ ప్రకారం బాగానే నటిస్తున్నాడు.

Advertisement