Viral Video : వైరల్ వీడియో : బాలకృష్ణ యాక్షన్ సన్నివేశాన్ని గుర్తు చేసిన బక్కెట్ యాడ్
NQ Staff - January 26, 2023 / 06:50 PM IST

Viral Video : ఏదైనా వస్తువును తయారు చేసినప్పుడు దాన్ని మార్కెట్లోకి తీసుకు వెళ్లాలి అంటే దానికి అద్భుతమైన ప్రమోషన్ చేయాలి. వస్తువు తయారు చేయడం ఈజీనే.. కానీ దాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లడం ఈమధ్య కాలంలో చాలా ఖర్చుతో కూడుకున్నదిగా మారింది.
విభిన్నమైన యాడ్ లను రూపొందించి జనాల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కువ శాతం ప్రోడక్ట్స్ యాడ్స్ క్రియేటివిటీ తోనే మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు తమ యొక్క కంపెనీ ఉత్పత్తులను కోట్లాది రూపాయలు ఖర్చు చేసి యాడ్స్ చిత్రీకరించి పబ్లిసిటీ చేస్తుంటారు.
తాజాగా బంగ్లాదేశ్ కి చెందిన ఒక ప్లాస్టిక్ బకెట్ తయారీ సంస్థ నిమిషం నిడివి ఉన్న ఒక యాడ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. ఆ యాడ్ చూస్తుంటే మన తెలుగు హీరో బాలకృష్ణ నటించిన ఫ్యాక్షన్ సినిమా లోని యాక్షన్ సన్నివేశం మాదిరిగా ఉంది.
బకెట్ తో కొడితే కారు వెనక్కి పోవడంతో పాటు ఇంకా రకరకాలుగా చూపించారు. ఆ బకిట్ అంత స్ట్రాంగ్ అన్నట్లుగా వారు చూపించే ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ బకెట్ యాడ్ చూస్తుంటే మన బాలకృష్ణ సినిమాలోని ఫైట్స్ సన్నివేశం చూసినట్టుగా అనిపిస్తుందని కొందరు సరదాగా ఈ వీడియోను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. మరి అక్కడ బకెట్ సేల్స్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ మీరు మాత్రం ఈ వైరల్ వీడియోను ఒక లుక్ వేయండి.