Buchi babu: త‌న త‌ర్వాతి సినిమా ఏంటో క‌న్‌ఫాం చేసిన బుచ్చిబాబు

Buchi babu: ఉప్పెన సినిమాతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు. కరోనాతో అల్ల కల్లోలం అవుతున్న స‌మ‌యంలో టాలీవుడ్ కు ఉప్పెన సినిమా ఇచ్చిన సక్సెస్ జోష్ చిన్నదేం కాదు. మంచి సమయంలో విడుదల అయిన ఉప్పెన వంద కోట్లకు పైగా రాబట్టింది. ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పలువురు నిర్మాతలు బుచ్చిబాబుకు అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారట.

buchi babu announs next movie
buchi babu announs next movie

బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటీ అంటే అంతా ఒకే మాట చెప్తున్నారు… ఎన్టీఆర్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా రూపొందబోతుంది. ఆ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. గురువు సుకుమార్ ను మించిన శిష్యుడు బుచ్చి బాబు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తూ.. ఆయన చేయబోతున్న ఎన్టీఆర్ మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో త‌న త‌దుప‌రి సినిమా విషయమై అనధికారికంగా బుచ్చి బాబు క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది. తాను ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన ఓకే చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని చెప్పాడు. ఒక్కో సీన్ ను పదుల వర్షన్ ల్లో రాసుకుంటున్నట్లుగా కూడా చెప్పుకొచ్చాడు. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.

పెద్ద హీరోతో సినిమా అంటూ బుచ్చి బాబు వ్యాఖ్యలు చేసిన సమయంలో మీరు చెప్పినా చెప్పకున్నా ఎన్టీఆర్ తో ఆ సినిమా ఉండబోతుందని మాకు తెలుసు అంటూ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అన్న సమయంలో బుచ్చి బాబు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. బుచ్చి బాబు మాటలను బట్టి చూస్తుంటే పాన్ ఇండియా సబ్జెక్ట్ కాదని తెలుస్తోంది.

buchi babu announs next movie1
buchi babu announs next movie1

ఎన్టీఆర్ తో బుచ్చి బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. కనుక వచ్చే ఏడాది ద్వితీయార్థంకు గాని బుచ్చి బాబుకు అవకాశం దక్కక పోవచ్చు అంటున్నారు.