Samantha: స‌మంత మీ కేసు వాప‌స్ తీసుకోండి.. ఇది మంచిది కాదు అంటున్న బీఎస్

Samantha: టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా చ‌లామ‌ణీ అవుతున్న‌స‌మంత అక్టోబ‌ర్ 2న నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. విడాకులు విష‌యం ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి స‌మంత‌పై దారుణంగా ట్రోల్స్ న‌డుస్తున్నాయి. అన్నింటికి నువ్వే కార‌ణ‌మంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు.

TheNewsQube-
BS Request Samantha To take Back Case
BS Request Samantha To take Back Case

ఒక సెక్షన్ గ్రూప్ స‌మంత‌పై తెగ విమ‌ర్శ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ సామ్ తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్లిపోతోంది. సోషల్ మీడియా లో కామెంట్లకు..పోస్టులకు తాను ఎలాంటి రిప్లై ఇవ్వదలుచుకోలేదని క్లియర్ గా చెప్పేసింది. అయితే అతిగా ఓవర్ చేసిన కొన్ని యూట్యూబ్ చానళ్లపై మాత్రం సామ్ పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.

వ్యక్తిగతంగా తన మనసుకు గాయం చేసింది రెండు యూట్యూబ్ ఛానెల్స్ అంటూ బహిర్గతం చేసి ఆమె పోరాటానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడ మీడియాతోనే సామ్ అంత్యంత చనువుగాను మెలుగుతోంది. సమంత సినిమా జీవితమంతా తెలుగు సినిమా తోనే ముడిపడి ఉంది కాబట్టి..సామ్ ని ఇబ్బంది పెడుతూ ఇక్కడి వారినే ప్రస్థావించి ఉంటుందని భావిస్తున్నారు.

అయితే తాజాగా టాప్ తెలుగు టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్,ఆన్‌లైన్ జ‌ర్నలిస్ట్ డైరెక్ట‌ర్ బీఎస్.. స‌మంత సోష‌ల్ మీడియాపై కేసు పెట్ట‌డం బాధించింద‌ని పేర్కొన్నాడు. మీ జీవితం అంతా సోష‌ల్ మీడియాతోనే పెన వేసుకుపోయింది.మీకు త‌ప్పు అనిపిస్తే వాటిని తొల‌గించేవాళ్లం కాని ఇలా కేసులు పెట్ట‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ద‌య‌చేసి వాటిని వెన‌క్కు తీసుకోండ‌ని కోరాడు.

అలాగే సమంత గుణశేఖర్ దర్శరకత్వంలో `శాకుంతలం`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోంది. కథ అంతా సమంత చుట్టూనే తిరుగుతుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన ఆసక్తికర ముఖ్య విషయాల్ని ఈ వేదికగా పంచుకుంది.