Bro Movie First Day Collections : బాక్సాఫీస్ ను ఊపేస్తున్న బ్రో మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే..?
NQ Staff - July 29, 2023 / 10:56 AM IST

Bro Movie First Day Collections :
పవన్ కల్యాణ్, సాయితేజ్ నటించిన మూవీ బ్రో ది అవతార్. ఈసినిమా తమిళ హిట్ మూవీ వినోదయ సిత్తంకు రీమేక్ గా వచ్చింది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా దీన్ని తెరకెక్కించారు. మొదటి నుంచి వింటేజ్ పవన్ కల్యాణ్ ఎంట్రీ అంటూ ఓ రేంజ్ లో అంచనాలను పెంచేశారు. అయితే ఈ మూవీ నిన్న థియేటర్లలోకి వచ్చింది.
భారీ వర్షాల కారణంగా వసూళ్లు తగ్గుతాయని చాలామంది అనుకున్నారు. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ పవన్ ఫ్యాన్స్ థియేటర్లకు ఎగబడ్డారు. దాంతో బ్రో మూవీ రూ.30 కోట్ల వరకు కలెక్షన్స్‌ను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా నైజాం ఏరియాలోనే వచ్చాయి. ఇక్కడ దాదాపు రూ.14 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ.
పవన్ ఇమేజ్ వల్లే..
గోదావరి జిల్లాల్లో ఐదు కోట్లు, ఉత్తరాంధ్ర, గుంటూరులలో రెండున్నర కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది బ్రో సినిమా. ఇక ఓవర్సీస్ లో కూడా రూ.2 కోట్లు వసూలు చేసినట్టు చెబుతున్నారు. ఇదంతా కేవలం పవన్ ఇమేజ్ వల్లే సాధ్యం అయిందని అంటున్నారు. తమిళ్ లో ఇంతటి కలెక్షన్లు రాలేదు.
ఇందులో పవన్ మేనరిజం, వింటేజ్ లుక్స్ ఇవన్నీ కలిసి వచ్చాయని అంటున్నారు. ఈ మూవీ బడ్జెట్ రూ.76 కోట్లుగా ఉంది. ఎలాగూ పాజిటివ్ టాక్ ఉంది. పైగా వీకెండ్ కాబట్టి కచ్చితంగా ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే ఛాన్స్ లేకపోలేదు. మరి బ్రేక్ ఈవెన్ చేస్తుందా లేదా అనేది చూడాలి.