Viral News : లవ్ బ్రేకప్ అయిన వారికి ఇన్సూరెన్స్.. కొత్త స్కీమ్ తో డబ్బులే డబ్బులు..!
NQ Staff - March 19, 2023 / 07:02 PM IST

Viral News : ఈ నడుమ ట్రెండ్ అనేది పూర్తిగా మారిపోతోంది. ఇప్పటి జనరేషన్ కు తగ్గట్టే స్కీములను అందుబాటులోకి తెస్తున్నాయి పలు కంపెనీలు. ఇక తాజాగా లవ్ బ్రేకప్ అయిన వారి కోసం హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ స్కీమ్ ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చాయి పలు కంపెనీలు. అంటే ప్రేమలో మోసపోయిన వారికి ఇది ఉపయోగపడుతుందన్న మాట.
ఈ మధ్య కాలంలో ప్రేమ వ్యవహారాలు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేమించుకున్న వారు విడిపోవడం కూడా బాగానే జరుగుతోంది. ఈ క్రమంలోనే లవ్ బ్రేకప్ అయిన వారి కోసం కంపెనీలు పలు స్కీములను పైకి తీసుకు వస్తున్నాయి. ఇప్పటికే పయనీర్ లాంటి సంస్థలు బ్రేకప్ ఇన్సూరెన్స్ లను తీసుకు వచ్చాయి.
ఒప్పందం ప్రకారం..
అంటే ఇద్దరు ప్రేమికులు ఒప్పందం ప్రకారమే.. ఇన్సూరెన్స్ కంపెనీలో ఓ జాయింట్ ఖాతాను తీసుకుంటారు. అందులో నెలకు రూ.1000 చొప్పున వేస్తారు. బ్రేకప్ అయిన తర్వాత మోసపోయిన వారికి ఆ మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్రేకప్ తర్వాత మోసపోయిన వారి ఆరోగ్య పరిస్థితులు, డిప్రెషన్ నుంచి బయట పడేందుకు ట్రీట్ మెంట్ లాంటి వాటి కోసం ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
రీసెంట్ గా ప్రతీక్ ఆర్యన్ అనే వ్యక్తి ఇలాగే లబ్ది పొందాడు. ఆయన వేరే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. కాగా తన ప్రియురాలు తనకు బ్రేకప్ చెప్పడంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా తాము ఒప్పందం ప్రకారం ముందుగానే చేసుకున్న ఇన్సూరెన్స్ నుంచి రూ.25వేలు పొందాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అది చూసిన వారంతా కూడా తమకు కూడా దీని గురించి చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.