BAAHUBALI: ప్ర‌మోష‌న్స్‌లో బాహుబ‌లిని మించి.. వ‌చ్చే ఏడాది చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తెచ్చే ఆలోచ‌న‌

ఇటీవ‌లి కాలంలో సినిమాని ఏ రేంజ్‌లో తెర‌కెక్కించాం అన్న‌ది కాదు ముఖ్యం, ఎంతలా ప్ర‌మోష‌న్ చేసాం అన్న‌దే ఇంపార్టెంట్‌. రాజ‌మౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి సినిమాకు రాజ‌మౌళి త‌న‌దైన స్టైల్‌లో ప్ర‌మోట్ చేయ‌డంతో మూవీపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పుడు ఇదే స్టైల్ లో ఓ మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ – అలియా భట్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ చిత్రం బ్రహ్మస్త్రా. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుందట. అయితే అందులో మొదటి భాగం ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

బ్ర‌హ్మాస్త్రా చిత్రంలో నాగార్జున కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమాపై జ‌నాల‌లో ఆస‌క్తిని క‌లిగించేందుకు మేక‌ర్స్ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ప్రస్తుతం చివరి దశలో ఉన్నటువంటి బ్రహ్మస్త్రా సినిమా నుండి 10 టీజర్స్ – 13 మోషన్ పోస్టర్స్ రెడీ చేసారని సమాచారం. ప్రమోషన్స్ కు సంబంధించిన ఈ టీజర్స్ – మోషన్ పోస్టర్స్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సిబిఎఫ్సి) వెరిఫికేషన్ కు పంపినట్లు తెలుస్తుంది. వాట‌న్నింటికి బోర్డ్ నుండి యూ స‌ర్టిఫికెట్ ద‌క్కిన‌ట్టు తెలుస్తుంది. సినిమాకు సంబంధించి కొన్ని మోషన్ పోస్టర్స్ సినిమాలోని పలు క్యారెక్టర్లను పరిచయం చేస్తాయని టాక్.

బ్ర‌హ్మాస్త్రా చిత్రాన్ని క‌ర‌ణ్ జోహార్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా, ఇందులో భారీ తారాగ‌ణం న‌టిస్తుంది. రణబీర్ కపూర్ – అలియా భట్ లతో పాటు ఈ సినిమాలో అమితాబ్ – నాగార్జున – మౌనిరాయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఐదువేల సంవత్సరాల క్రితం నాటి కథతో తెరకెక్కుతుండటంతో సినిమా పై ఆసక్తి నెలకొంది. బ్రహ్మస్త్ర అనే సినిమా కథ.. అత్యంత శక్తివంతమైన ఒక ఆయుధం చుట్టూ తిరుగుతుందని.. ఇందులో రణబీర్ శివ అనే పాత్రలో కనిపిస్తాడట. శివ మీద మనసుపడే ఇషా పాత్రలో అలియా భ‌ట్‌నటిస్తోంది. ఒక ఫేమస్ పురాతన ఆలయాన్ని పునరుద్ధరించడానికి పురావస్తు శాస్త్రవేత్త నాగార్జున తన విద్యార్థులతో కలిసి గంగా ఒడ్డున యాత్రకు వెళ్లడమే ఈ సినిమా ప్రధాన కథాంశం అని బాలీవుడ్ వర్గాలలో టాక్.