Brahmanandam: మా క‌థ‌కుడు రెడీ.. పంచ‌తంత్రం నుండి బ్ర‌హ్మానందం పోస్ట‌ర్

Brahmanandam: కామెడీకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన బ్ర‌హ్మానందం ఈ మ‌ధ్య సినిమాలు త‌గ్గించారు. ఆయ‌న స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు చేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. యంగ్ యాక్టర్స్ నటిస్తున్న పంచతంత్రం మూవీలో బ్రహ్మానందం వేదవ్యాస్ అనే కథకుడిగా కనిపించనున్నారు. పంచేంద్రియాల చుట్టూ అల్లుకున్న కథతో తెరకెక్కుతోన్న సినిమా ‘పంచతంత్రం’. ఈ సినిమాకు సంబంధించి మా కథకుడు రెడీ అంటూ పోస్టర్ విడుదల చేసింది యూనిట్.

Brahmanandam Garu aka Vedavyas unfolds the tale of Panchathantram
Brahmanandam Garu aka Vedavyas unfolds the tale of Panchathantram

ఈ చిత్రంలో పద్మశ్రీ’ బ్రహ్మానందం , సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించి అప్ డేట్ ఇచ్చింది మూవీ టీమ్. మాకథకుడు రెడీ అంటూ బ్రహ్మానందం పోస్టర్ విడుదల చేసింది టీమ్.

ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన… ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నామన్నారు మేకర్స్. ఐదు భావేద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి” అని చెప్పారు.

రెండు మూడు దశాబ్దాల క్రితం మన పల్లెటూరి దేవాలయాల్లో పురాణ కథలు వల్లించే కథకులు ఉండేవారు. రాత్రిపూట కథకుడు చెప్పే పురాణ కథలు వింటూ పల్లె ప్రజలు కాలక్షేపం చేసేవారు. పంచతంత్రం మూవీలో బ్రహ్మనందం అలాంటి కథకుడిగా కనిపించనున్నాడు. చిత్రీకరణ దాదాపుగా పూర్తి కావొచ్చిన ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.