Brahmanandam : బ్రహ్మానందం ఆస్తులు ఎన్ని వందల కోట్లో తెలుసా.. హీరోలను మించి..!
NQ Staff - February 2, 2023 / 05:00 PM IST

Brahmanandam : హాస్య బ్రహ్మ.. నవ్వుల రారాజు. తన ముఖ కదలికలతోనే నవ్వించే నటుడు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సృష్టించిన కళకారుడు.. ఇప్పటికే ఆయన ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆయనేనండి బ్రహ్మానందం. ఆయన నటుడిగా ఎంతో కీర్తిని సంపాదించుకున్నాడు. లెక్చరర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన బ్రహ్మానందం.. ఆ తర్వాత నటుడిగా మారాడు.
ఆయన కమెడియన్ గా వచ్చిన మొదటి సినిమా ఆహనా పెళ్లంట. ఇందులో ఆయన ముఖ కదలికలతోనే నవ్వించాడు. అందుకే వరుసగా ఆయనకు అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదిగి ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. అప్పట్లో ఆయన లేని సినిమానే ఉండేది కాదు.
ఆయన కామెడీ హైలెట్..
స్టార్ హీరోల సినిమాలు అంటే కచ్చితంగా బ్రహ్మానందం ఉండాల్సిందే. ఆయన లేకుండా సినిమాలను తీసేందుకు ఏ పెద్ద హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించే వాడు కాదు. బ్రహ్మానందం కామెడీతో హిట్ అయిన సినిమాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. కాగా ఆయన ఒక్కో కాల్షీటుకు లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు.
ఒక్కో మూవీకి రూ.కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. దాదాపు 1250కు పైగా సినిమాల్లో నటించిన గొప్ప నటుడు ఆయన. ఆయన ఆస్తి దాదాపు రూ.600కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఎన్నో లగ్జరీ కార్లు కూడా ఆయన గ్యారేజ్ లో ఉన్నాయి.