Brahmanamdam : బ్రహ్మానందం అందరికీ సూపర్ హీరో , కానీ ఈ ఒక్క విషయం లో విలన్ గా దొరికిపోయాడు !

Brahmanamdam : బ్రహ్మానందం.. సినిమా ఇండస్ట్రీలో హాస్య నటుడిగా ఎంతటి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తే చాలు అందరి ముఖం లో నవ్వు మొదలవుతుంది. ఇక ఆయన డైలాగ్స్ తో పర్ఫార్మెన్స్ తో ఉన్నంత సేపు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి వెళతారు. స్టార్ హీరోలు కూడా బ్రహ్మానందం కి అభిమానులుగా మారిపోయారంటే ఆయన హాస్యంతో ఎంతగా మెసమ్రైజ్ చేశారో వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే హాస్య బ్రహ్మ గా బ్రహ్మానందం ఇండస్ట్రీ ఆయనకి ఆయనే సాటి గా నిలిచారు.

brahmanamdam-he-is-super-hero-in-all-aspects
brahmanamdam-he-is-super-hero-in-all-aspects

కాగా ఇటీవల బ్రహ్మానందం బర్త్ డే జరుపుకున్నారు. ఆ సమయంలో బ్రహ్మానందం ను కొందరు మీడియా వర్గాల వారు అలాగే అభిమానులు కలిసేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనపై వస్తున్న మీమ్స్ తనను ఉపయోగించి చేస్తున్న మీమ్స్ పట్ల ఫిదా అయ్యాడు. సినిమాల్లో నటించి నవ్వించాను ఇప్పుడు ఇలా కూడా నవ్విస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ చిన్న బైట్ ఇచ్చాడు. ఈ బైట్ ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం తెగ వైరల్ అయ్యింది. ఆ సమయంలో బ్రహ్మానందం కారును ఆ వీడియోలో చూపించడం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని కొందరు నెటిజన్స్ అనవసరమైన కామెంట్స్ చేస్తున్నారు.

Brahmanamdam : ఈ విషయాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియా లో తెలిపాడు..!

సాధారణంగా సినిమా సెలబ్రెటీ వాహనాలు కనిపించిన వెంటనే వాటిపై చలాన్ లు ఎన్ని ఉన్నాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆరాట పడుతుంటారు. రక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా బ్రహ్మానందం కారు నెంబర్ ను చూసిన వారు వెంటనే చలాన్ లు చెక్ చేశారట. ఆయన కారు పై ఏకంగా 14895 రూపాయల చలాన్ లు ఉన్నట్లుగా తెలుసుకున్నారట. ఈ విషయాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియా లో తెలిపాడు. సర్ మీ వెహికిల్ పై రూ.14895 చలాన్ లు ఉన్నాయి ఊరికే చెబుతున్నాను అంటూ హ్యాపీ బర్త్ డే అని పోస్ట్ చేశాడు. మరికొందరు ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో నెటిజన్స్ ఎవరికి తోచినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement