Brahmaji: మీరే మా పెద్ద దిక్కు అంటూ బ్ర‌హ్మాజీ కామెంట్.. నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు

Brahmaji: సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రిస్తున్న చిరంజీవి క‌రోనా స‌మ‌యంలో ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అడిగిన వారికి కాద‌న‌కుండా సాయం చేసిన చిరు అంద‌రి మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. రీసెంట్‌గా ఆయ‌న యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్‌ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆరోగ్యంకి సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

TheNewsQube-
brahmaji tweet to chiranjeevi1
brahmaji tweet to chiranjeevi1

ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌ రాజ్‌కుమార్‌ కార్డియాక్‌ అరెస్ట్‌తో చనిపోయారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్‌ హార్ట్‌ సమస్యతోనే మరణించారు. పునీత్‌ సోదరుడూ ఇదే సమస్యతో బాధపడి కోలుకున్నారు. జీన్స్‌ ద్వారా ఇలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.

చిన్న వయసులోనే పునీత్‌ చనిపోయారన్న విషయం ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడాలి’ అని సూచించారు. అలానే ఇండస్ట్రీలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇలా అందరి తరుపున సాయం అడిగాడు. అందరి ముందే సాయాన్ని అడిగేశాడు చిరు. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌లో మా సభ్యులు, 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన అందరికీ కూడా ఏదైనా మేలు చేసేలా చర్యలు తీసుకుంటారా? అని చిరంజీవి అడిగాడు.

ఆ వెంటనే యోధా లైఫ్ లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని మైకు అందుకున్నాడు. అందరికీ యాభై శాతం రాయితీ ఇస్తామని ప్రకటించాడు. దీంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అందరి కోసం చొరవ తీసుకుని అందరి ముందు అడిగేయడం పెద్దన్న లక్షణం, అందుకే ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అని అంటారు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

brahmaji tweet to chiranjeevi2
brahmaji tweet to chiranjeevi2

అయితే తాజాగా బ్రహ్మాజీ ఇదే విషయం మీద స్పందించాడు. మా పెద్ద దిక్కు అంటూ చేతులెత్తి దండం పెడుతున్న ఎమోజీని షేర్ చేశాడు. అయితే బ్రహ్మాజీ ట్వీట్ కింద రకరకాల కామెంట్లు మొదలయ్యాయి.భజ‌న మొద‌లైంది అంటూ కొంత మంది సెటైర్స్ వేస్తున్నారు.