Sridevi : శ్రీదేవిని అందరి ముందే చెప్పుతో కొట్టింది ఎవరో తెలుసా.. అప్పట్లో ఇదో సంచలనం..!
NQ Staff - June 9, 2023 / 01:38 PM IST

Sridevi : శ్రీదేవికి అప్పట్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆమె అందాలకు కుర్రాళ్లు ఊగిపోయేవారు. ఆమెను ఒక దేవతలా పూజించేవారు చాలామంది. అలాంటి శ్రీదేవి సినీ కెరీర్ లో ఎలాంటి ఇబ్బందులు పడలేదు. కానీ ఆమె వ్యక్తిగతంగా మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. అప్పట్లో ఆమె సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పుడే బాలీవుడ్ కు వెళ్లింది.
అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఆ సమయంలోనే ఆమె బాలీవుడ్ బడా నిర్మాత బోణీ కపూర్ తో ప్రేమలో పడింది. బోణీ కపూర్ కు అప్పటికే పెండ్లి అయి ఓ కొడుకు కూడా పుట్టాడు. అయినా సరే శ్రీదేవి ఆయనతో ప్రేమలో పడింది. బోణీ కపూర్ తో రహస్యంగా ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు అప్పట్లో పత్రికల్లో వచ్చాయి.
ఈ విషయం తెలుసుకున్న బోణీ కపూర్ తల్లి ఓ సారి శ్రీదేవిని షూటింగ్ స్పాట్ లోకి వెళ్లి కలిసిందంట. ఇదే విషయం మీద నిలదీసిందంట. అందరూ చూస్తుండగానే చెప్పుతో కొట్టిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే విషయం అప్పుడు మన తెలుగు పత్రికల్లో కూడా ప్రధాన శీర్శికలతో వచ్చాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ.. ఆ విషయం అప్పట్లో హాట్ టాపిక్ గా ఉండేది.
కానీ ఆ విషయం మీద ఎన్నడూ శ్రీదేవి స్పందించలేదు. ఇక కొంత కాలం తర్వాత బోణీ కపూర్ ఆమెను రెండో పెండ్లి చేసుకున్నాడు. ఈ జంటకు జాన్వీకపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. జాన్వీ ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.