Bommarillu Bhaskar: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రం కోసం ద‌ర్శ‌కుడికి అంత రెమ్యున‌రేష‌న్ ఇచ్చారా..!

Bommarillu Bhaskar: అఖిల్‌, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ తెర‌కెక్కించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్. ఎంతోకాలంగా ఓ మంచి హిట్‌ కోసం చూస్తున్న అఖిల్‌ ఖాతాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ పడిందని ఫ్యాన్స్‌ అంతా చర్చికుంటున్నారు. ఇక మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ చూసిన టాలీవుడ్‌ ప్రముఖులు దర్శకుడు, హీరోహీరోయన్‌తో పాటు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Bommarillu Bhaskar Remuneration for Most Eligible Bachelor Movie
Bommarillu Bhaskar Remuneration for Most Eligible Bachelor Movie

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన భాస్క‌ర్.. గ‌తంలో దిల్ రాజు నిర్మాణంలో సిద్ధార్ధ్, జెనీలియా హీరో, హీరోయిన్లుగా ప్రకాష్ రాజ్, జయసుధ ఇతర ముఖ్యపాత్రల్లో బొమ్మ‌రిల్లు చిత్రాన్ని తెర‌కెక్కించాడు.ఈ చిత్రం తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కి సంచలన విజయం సాధించింది.

ఇప్పుడు 15 యేళ్లు త‌ర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఒక్కోసారి ప్రేమ ఎక్కువైనా కూడా ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనేది బొమ్మ‌రిల్లు సినిమాలో చాలా చక్కగా చూపించడమే కాకుండా సక్సెస్ అందుకున్నారు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.

బొమ్మ‌రిల్లు సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో చేసిన పరుగు ఆశించిన ఫలితం అందుకోలేదు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ‘మగధీర’ సినిమా తర్వాత చేసిన ‘ఆరెంజ్’ సినిమా బాగున్నా.. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత రామ్‌తో ‘ఒంగోలు గిత్త’ సినిమా చేసిన ఫలితం రాలేదు. ఆపై తమిళంలో ‘బెంగళూరు నాటకల్’ సినిమా చేసారు.

అఖిల్‌తో చేసిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా కోసం అల్లు అరవింద్.. ఈయనకు నెలకు రూ. 2 లక్షల రూపాయల జీతం ఇచ్చారు. ఈ సినిమా కోసం భాస్కర్ దాదాపు రెండున్నరేళ్లు కేటాయించారు.ఈ లెక్కన ఈ సినిమా కోసం భాస్కర్ దాదాపు రూ. 60 లక్షల రూపాయల పారితోషకం అందుకున్నారు. అంతేకాదు సినిమా హిట్టైయితే.. రూ. 40 లక్షల రూపాయలు కింద అందనుంది.