Bommarillu Bhaskar: ఆరెంజ్ సినిమా సమయంలో నాగ‌బాబు సూసైడ్ విషయంపై నోరు విప్పిన భాస్క‌ర్

Bommarillu Bhaskar: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్ళీ ఇండస్ట్రీని పలకరించిన డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్. తన ఫస్ట్ సినిమానే, తన బిగ్గెస్ట్ హిట్ ని తెచ్చిపెట్టిన సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. మొదటి సినిమాతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఎప్పుడూ మన చుట్టూ కామన్ గా ఉండే ఒక విషయాన్ని అతి సున్నితమైన ఫ్యామిలీ సెంటిమెంట్ ఎలిమెంట్స్ ని కూడా చాలా చక్కగా తెరకెక్కించిన ఘనత భాస్కర్ ది. అలా బొమ్మరిల్లు సినిమా సక్సెస్ అయినప్పుడు పది రోజుల పాటు వేరే ఊరు వెళ్ళిపోయి ఉన్నారట.

Bommarillu Bhaskar about Nagababu Suicide Attempt
Bommarillu Bhaskar about Nagababu Suicide Attempt

అలాగే తాను సక్సెస్ ని, ఫెయిల్యూర్ ని దాదాపు ఒకేలా చూస్తానని అన్నారు. బిగ్గెస్ట్ హిట్ వచ్చిందని పొంగిపోనని అన్నారు. అలాగే ఫెయిల్యూర్ ని కూడా ఖచ్చితంగా అంగీకరిస్తానని అన్నారు. జీవితంలో ప్రతి విషయాన్ని ఫేస్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం అనుకున్నదాని కోసం ట్రై చేస్తూనే ఉండాలని అన్నారు. ఆరెంజ్ సినిమా విషయంలో కూడా తన ఫెయిల్యూర్ ని తట్టుకున్నానని అన్నారు.

కానీ ఆ సినిమా ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాన్ని ప్రజంట్ చేయడం హ్యాపీనెస్ ఇచ్చిందని అన్నారు. ఆరెంజ్ తన సినీ కెరీర్ లో ఏ సినిమాకి అంత కష్టపడలేదని అన్నారు. అంత ప్రాణం పెట్టి తీసిన సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈరోజుకి ఆ మూవీ నుండి ఏదొకటి నేర్చుకునేలా తీసానని అన్నారు. ఆ సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ కూడా చాలా స్పెషల్ గా ఉందని, మ్యూజిక్, డాన్స్ విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారని అన్నారు.

అలాగే ఆరెంజ్ సినిమాకి నాగబాబు సూసైడ్ పై వచ్చిన వార్తలన్నీ నిజం కాదని అన్నారు. ఓ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని అంగీకరించడం కూడా కామన్ పాయింట్ అని అన్నారు. అలాగే అల్లు అర్జున్ తో కూడా భాస్కర్ కు మంచి రాపో ఉందని అన్నారు. ఇక నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. తానెప్పుడూ ఒక హీరోతో సినిమా చేద్దామని అనుకోనని తానుగా ఓ కథ రాసుకున్నాక, ఆ కథకు తగ్గట్టుగా హీరోహీరోయిన్లను సెలెక్ట్ చేసుకుంటానని అన్నారు. అలాగే సీక్వెల్స్ కూడా ట్రై చేయనని అన్నారు. ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఆమని క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని, సినిమా టైటిల్ కి కనెక్టివిటీగా ఉంటుందని అన్నారు.

అలాగే సిసింద్రీ సినిమా తర్వాత మళ్ళీ అఖిల్ కి తల్లి పాత్రను పోషించడం కూడా స్పెషల్ గా ఉండబోతుందని డైరెక్టర్ అన్నారు. ఈ సినిమా టీజర్, సాంగ్స్ కి, కథకు సీతారామశాస్త్రి బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని అన్నారు. ఈ కోవిడ్ టైమ్ లో ఇంత బాగా కంటెంట్ బాగా రావడానికి కారణం జీఏ2 సంస్థ అని చెప్పారు. అలాగే అక్టోబర్ 8న ఈ సినిమా రిలీజ్ కి ప్రేక్షకులందకూ థియేటర్ లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అన్నారు.