Ajith: స్టార్ హీరోకు బాంబు బెదిరింపు.. అసలు ఏం జరిగింది అంటే…!

Ajith: స్టార్ హీరోలకు ఇండస్ట్రీ లో ఎంత క్రేజ్ ఉంటుందో.. ఆకతాయిల అల్లరి కూడా అదే స్థాయిలో ఉంటుంది. అలాంటి ఓ సంఘటన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కు ఎదురైంది. అజిత్ ఇంట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బాంబు పెట్టినట్టు బెదిరింపు కాల్స్ చేయడం తో కోలీవుడ్ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీంతో అభిమానులు సైతం ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Ajith kumar

అజిత్ తిరువాన్మియురులో నివాసం ఉంటున్నారు..

ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అజిత్ ఇంట్లో బాంబు పెట్టామని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే ఈ విషయాన్ని అజిత్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలిసులు అజిత్ ఇంటికి చేరుకుని బాంబు స్క్వాడ్ తో అజిత్ ఇల్లు మొత్తం తనిఖీ చేసారు. ఇంటిని పూర్తిగా వెతికినా తర్వాత ఇంట్లో ఎలాంటి బాంబు లేదని నిర్దారించారు. ఎవరో కావాలని ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలిసులు ఈ పని ఎవరు చేసారు అనే దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అజిత్ కు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి. అలా కాల్స్ చేసిన వారిని వెతికి పట్టుకుని అరెస్ట్ చేసారు. మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం తో ఈ పని ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మళ్ళీ ఇలాంటి కాల్స్ రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని అజిత్ కోరారు.

Ajith kumar

కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోల వ్యక్తిగత ఫోన్ నంబర్ లు దొరికినప్పుడు వారికి ఇలాంటి ఫోన్లు, మెసేజ్ లు చేస్తుంటారు. ఏదో ఆటపట్టించాలనే ఉద్దేశం తో ఇలాంటి పనులు చేస్తుంటారని పోలిసులు అంటున్నారు. ఇకపై ఇలాంటి ఫోన్లు రాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఈ పని చేసిన వారిని వెతికి పట్టుకొని.. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఇక ప్రస్తుతం అజిత్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వాలిమై అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు మరికొన్ని సినిమాల్లో అజిత్ పనిచేస్తున్నారు.