Dileep Kumar: బాలీవుడ్ సినీ దిగ్గ‌జం దిలీప్ కుమార్ క‌న్నుమూత‌

Dileep Kumar: క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న వేళ సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు సైతం క‌న్నుమూస్తున్నారు. కొంద‌రు క‌రోనాతో క‌న్నుమూస్తుంటే మ‌రి కొంద‌రు అనారోగ్యంతో తుదిశ్వాస విడుస్తున్నారు. తాజ‌గా బాలీవుడ్ సినీ న‌ట ఆరాధ్య దైవం దిలీప్ కుమార్ యూసుఫ్ ఖాన్ క‌న్నుమూసారు. ఇటీవలే ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా ప్లూరల్‌ యాస్పిరేషన్‌’ (ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించడం) ప్రొసీజర్‌ నిర్వహించారు. కానీ మళ్లీ తీవ్ర అస్వస్థతకు లోనవడంతో ప్రాణలు విడిచారు.

Bollywood Super Star Dileep Kumar is No More
Bollywood Super Star Dileep Kumar is No More

ఈ రోజు ఉద‌యం 7.30ని.ల‌కు దిలీప్ కుమార్ మ‌ర‌ణించార‌ని వైద్యులు ప్ర‌క‌టించారు. కొన్నాళ్లుగా దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న‌ను కొద్ది రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచ‌డం, తిరిగి ఇంటికి తీసుకురావ‌డం జ‌రుగుతూనే ఉంది. రీసెంట్‌గా దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుప‌డిందని ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలోనే ఉన్నామ‌ని ఆయ‌న భార్య చెప్పుకొచ్చింది. ఈ వార్త విని అంద‌రు సంతోషిస్తున్న క్ర‌మంలో దిలీప్ క‌న్నుమూసార‌నే వార్త అభిమానుల‌ని క‌లిచి వేసింది.

1922లో జ‌న్మించిన దిలీప్ కుమార్ పాకిస్తాన్‌లోని పేషావ‌ర్‌లో జ‌న్మించారు. ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త్‌కు వ‌చ్చిన ఆయ‌న సినీ న‌టుడిగా ప్ర‌ఖ్యాతి గాంచారు. రాజ్ క‌పూర్ కుటుంబంతో స‌న్నిహిత సంబంధాల‌ను మెయంటైన్ చేసిన దిలీప్ ఎన్నో అద్భుత‌మైన చిత్రాల‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

దిలీప్ కుమార్ న‌ట‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో పాటు అనేక ప్రైవేటు సంస్థ‌లు అనేక బిరుదుల ప్రదానం చేశాయి. 1944లో సినీరంగంలోకి ప్ర‌వేశించిన దిలీప్ కుమార్ అనంత‌రం సైరాభానుని వివాహం చేసుకున్నారు. ఇద్ద‌రు ఎంతో అన్యోన్యంగా ఉంటూ అంద‌రికి ఆద‌ర్శంగా నిలిచారు. ఈ వ‌య‌స్సులోను సైరా త‌న భ‌ర్త‌కు అనేక స‌ప‌ర్య‌లు చేస్తూఈ అదృష్టం దొరికినందుకు సంతోషిస్తున్నాను అని ప‌లు మార్లు చెప్పుకొచ్చింది.

గతేడాది దిలీప్‌ కుమార్‌ సోదరులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కరోనాతో ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే దిలీప్‌ కూడా కన్నుమూయడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.