Bollywood: నా సినిమా జీవితం హ్యాపీగా లేదంటున్న స్టార్ హీరోయిన్

Bollywood: బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోహీరోయిన్లున్నారు. అందులోనూ గ్లామర్ హీరోయిన్లకు ఉన్న క్రేజ్ మరింత డిఫరెంట్. ఈ కోవకు చెందిన బ్యూటీ పరిణీతి చోప్రా. ఇండస్ట్రీలోకి ప్రియాంక చోప్రా చెల్లెలిగా అడుగుపెట్టినా, తన టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ ను దక్కించుకుంది. ఆమె ఎడ్యూకేషన్ అంతా మాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుండి పట్టా పొంది, యశ్ రాజ్ ఫిలిమ్స్ లో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా వర్క చేసింది. అలా 2011 లో యశ్ రాజ్ నిర్మించిన లేడీస్ వర్సెస్ రికీ బౌల్ సినిమాతో హీరోయిన్ అయ్యింది. ఈ సినిమాకి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డ్ ని అందుకుంది పరిణీతి. ఇంకేం వరుస హిట్స్ తో దూసుకుపోయింది. బాలీవుడ్ మోస్ట్ గ్లామర్ క్వీన్ గా ముద్ర వేయించుకుంది.

Bollywood

ఇషాక్ జాదే, శుద్ధ్ దేశి రొమాన్స్, హసీ తో ఫసీ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఆమె సినిమాల్లో పరిణితి చేసిన యాక్టింగ్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ కూడా యూత్ ని ఎంటర్ టైన్ చేసింది. ఆమె నటనకు, అందాలకు ప్రతిఒక్కరు ఫిదా అయ్యారు. పరిణీతి చోప్రా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరలేకపోయింది. ఓ మంచి నటిగా మాత్రం పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది పరిణితీ యాక్ట్ చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవ్వడం విశేషం. ది గర్ల ఆన్ ది ట్రైన్, సందీప్ ఔర్ పింకీ ఫెరార్, సైనా లాంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసింది. మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే కెరీర్ ప్రారంభించి పరిణీతి చోప్రా పదేళ్ళు కావడం విశేషం. కెరీర్ మొదట్లో పీక్ స్టేజ్ లో ఉన్న పరిణీతి రాను రాను ఆమె చేసిన సినిమాలపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ తగ్గిపోయింది.

Bollywood

ఈ కథ ప్రజల్లోకి వెళ్ళదని తెలిసిన తర్వాత కూడా సినిమాలు నటించిన పరిస్థితులున్నాయని చెప్పింది. రీసెంట్ గా సాగిన ఓ ఇంటర్వ్యూలో గత ఐదేళ్ళుగా తాను చేస్తున్న సినిమాలు సంతృప్తిని ఇవ్వలేకపోయాయని తెలిపింది. నిజానికి తాను అన్ హ్యాపీగా ఉన్నానని.. తాను ఆశించిన క్యారెక్టర్ లభించలేదని అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి సినిమాలకు సైన్ చేస్తున్నానంటూ కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్ గా చేసిన సినిమాలు సైనా, సందీప్ ఆర్ పింకీ ఫరార్ సినిమాలు చేసినందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. అలాగే పరిణితి, రణబీర్ కపూర్ కాంబీనేషన్ లో ఓ సినిమా రాబోతుంది.