Bollywood: ప్రేయ‌సి కోసం క‌ళ్లు తిరిగే భ‌వ‌నం సొంతం చేసుకున్న స్టార్ హీరో

Bollywood: ఈ మ‌ధ్య మ‌న హీరోలు అంద‌రు తోటి హీరోయిన్స్‌తో ప్రేమ‌లో ప‌డుతున్నారు. కొద్ది రోజుల డేటింగ్ త‌ర్వాత పెళ్లి పీట‌లెక్కుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ కూడా ఇదే కోవ‌లో ఉన్నాడు. తోటి క‌థానాయిక అలియా భ‌ట్‌తో ప్రేమ‌లో పడ్డ ర‌ణ్‌బీర్ క‌పూర్ కొద్ది రోజులుగా డేటింగ్‌లో ఉన్నాడు. ఆమెతో త్వ‌ర‌లో పెళ్లి పీట‌లెక్కేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నాడు.

Bollywood

ర‌ణ్‌బీర్ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న త‌ల్లిదండ్రుల‌తోనే నివ‌సిస్తున్నారు. తన తండ్రి రిషీ కపూర్ పాపులర్ ఆర్కే స్టూడియోను విక్రయించి భారీగా డబ్బును దాచి ఉంచారు. ఇప్పుడు అలా వచ్చిన పెట్టుబడితోనే రణబీర్ తన కొత్త ఇంటిని ముంబైలో నిర్మిస్తున్నారని సమాచారం. ఎలాగూ త్వ‌ర‌లో అలియా భ‌ట్‌ని చేసుకోనున్న నేప‌థ్యంలో కొత్త ఇంటిని నిర్మించే ఆలోచ‌న చేస్తున్నాడ‌ట‌. ఇన్నాళ్లు అత‌ని తల్లిదండ్రులు రిషి- నీతు ఇటీవల వరకు ఖరీదైన అపార్ట్ మెంట్లో నివసించేవారు. ఆ భవంతికి ధీటుగా ఇప్పుడు రణబీర్ తనకు ఖరీదైన ఇల్లును నిర్మించుకుంటున్నాడు. ఇది సకల సౌకర్యాలతో ఇంద్రభవనాన్ని తలపిస్తుందని చెబుతున్నారు.

అమితాబ్ బచ్చన్, షారూక్ , రేఖ, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్,హేమ మాలిని, రాజేష్ ఖన్నా, అక్షయ్ కుమార్, అనీల్ కపూర్, ఫర్హాన్ అక్తర్ , సంజయ్ దత్,సోనాక్షి సిన్షా.. షాట్ గన్ శత్రుఘ్న తదితరులు నిర్మించిన భవనాలు ముంబైలో అత్యంత విలాసవంతమైనవిగా ఉంటాయి. ఇప్పుడు వాటిని త‌ల‌ద‌న్నేలా ర‌ణ్‌బీర్ నిర్మిస్తున్నాడ‌ని భోగ‌ట్టా.

Bollywood

దాదాపు 40 కోట్ల ఖ‌ర్చుతో భ‌వంతిని నిర్మిస్తున్నాడ‌ని తెలుస్తుండ‌గా, అతి త్వ‌ర‌లోనే గృహ ప్ర‌వేశం చేస్తాడ‌ట‌. ఈ ఇంటిని అలియాభ‌ట్‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఇస్తాడ‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని రణబీర్ కాని ఆయ‌న టీం ఎవ‌రు కాని ఇప్పటివరకూ ధృవీకరించలేదు. ప్రస్తుతం రణబీర్ యానిమల్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సందీప్ వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంలో రణబీర్ సరసన పరిణీతి చోప్రా కథానాయికగా నటిస్తోంది.

క‌బీర్ సింగ్ త‌ర‌హాలోనే ర‌ణ్‌బీర్ సింగ్ యానిమ‌ల్ ఉంటుంద‌నే టాక్ న‌డుస్తుంది. మూవీలో నిత్యం గొడవలు పడే తండ్రి కొడుకుల రిలేషన్ షిప్ ని వయొలెంట్ కంటెంట్ తో చూపించనున్నారని తెలుస్తోంది. ఎంచుకున్న థీమ్ లైన్ కచ్ఛితంగా థ్రిల్ చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని 2022 దసరా కానుకగా రిలీజ్ చేయాలన్నది ప్లాన్.