Bollywood : విడ్డూరం : వదినతో.. మరదలుతో రొమాన్స్ చేసిన హీరోలు వీల్లే

NQ Staff - September 18, 2022 / 10:55 AM IST

Bollywood  : విడ్డూరం : వదినతో.. మరదలుతో రొమాన్స్ చేసిన హీరోలు వీల్లే

Bollywood  : టాలీవుడ్ లో కొన్ని పద్ధతులు.. సెంటిమెంట్స్ పాటిస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ లో అలాంటివి ఉండవు. తెలుగు హీరో ల యొక్క కూతుర్లను హీరోయిన్లుగా చూసేందుకు ఇక్కడ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించారు కానీ బాలీవుడ్లో మాత్రం స్టార్ హీరోల యొక్క కుమార్తెలు ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

అలాగే తమకు వరసకు వదిన లేదా మరదలు అయ్యే హీరోయిన్స్ తో హీరోలు రొమాన్స్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.

ఇప్పుడు మనం చూద్దాం..

Bollywood Hero Heroines Do Not Maintain Relationship

Bollywood Hero Heroines Do Not Maintain Relationship

సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలో మలైకా అరోరా తో ఐటమ్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఆమె సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ యొక్క మాజీ భార్య. అంటే మరదలితో సల్మాన్ ఖాన్ ఐటెం సాంగ్ చేశాడన్నమాట.

ఇక తన సోదరుడు బోనీ కపూర్ భార్య శ్రీదేవి తో అనిల్ కపూర్ ఎన్నో సినిమాల్లో నటించాడు. వారిద్దరిది మంచి రొమాంటిక్ జోడి అనే పేరు కూడా దక్కింది. ఇద్దరి కాంబినేషన్లో పలు సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. అయితే పెళ్లి తర్వాత శ్రీదేవి తనకు మరిది అయ్యే అనిల్ కపూర్ తో నటించలేదు.

ఇక సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం కరీనా కపూర్ ఖాన్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో కరీనా కపూర్ సోదరి కరిష్మా తో సైఫ్ అలీ ఖాన్ సినిమాలో నటించాడు. సైఫ్‌ మరియు కరిష్మా కపూర్ రొమాన్స్ అప్పట్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.

అజయ్ దేవగన్ కూడా తన మరదలు తో రొమాన్స్ చేశాడు. అజయ్ దేవగన్ భార్య కాజోల్ కి రాణి ముఖర్జీ సోదరి అవుతుంది. అలా తన భార్య సోదరితో అజయ్ దేవగన్ కూడా రొమాంటిక్ సీన్లలో నటించి ప్రేక్షకులకు వినోదాన్ని అందించాడు.

ఇలాంటివి ముందు ముందు కూడా బాలీవుడ్ లో జరిగే అవకాశం ఉంది. అయితే ఇందులో ఎక్కువ శాతం పెళ్లి జరగక ముందు నటించిన వారే ఉన్నారు. పెళ్లయిన తర్వాత వదిన లేదా మరదలుతో రొమాంటిక్ సన్నివేశాలు నటించింది అతి కొద్ది మందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us