DANGAL: సోష‌ల్ మీడియాకు దూరం అవుతున్న సెల‌బ్రిటీలు.. దంగ‌ల్ బ్యూటీ నిర్ణ‌యంతో షాక్‌లో ఫ్యాన్స్

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా అనేది సెల‌బ్రిటీల‌కు చాలా ముఖ్యం అనే సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సామాజిక మాధ్య‌మాల ద్వారా సినిమా సంగ‌తుల‌ని షేర్ చేసుకోవ‌డంతో పాటు అభిమానుల‌తో మంచి ,చెడ్డా కూడా చెప్పుకోవ‌చ్చు. సినిమాల‌తో కూడా రాని ఆద‌ర‌ణ ఇప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా వ‌స్తుంద‌టే అతి శయోక్తి కాదు. ఫేడ్ ఔట్ అయిన చాలా మంది భామలు హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి నెటిజ‌న్స్ మ‌న‌సులు గెలుచుకుంటున్నారు. ఇక సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా స‌గం సోష‌ల్ మీడియా ద్వారానే చేస్తున్నారు. సినిమా రంగానికి చెందిన వాళ్ల‌కు సోష‌ల్ మీడియా ఇంత అడ్వాంటేజ్‌గా మార‌గా, కొంద‌రు దీని నుండి తప్పుకుంటున్నాడు.

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, ఛార్మింగ్ బ్యూటీ ఛార్మి, ఓ బాలీవుడ్ న‌టి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఫాతిమా స‌నా షేక్ కూడా కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉండబోతున్నట్లు ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రకటించింది. అయితే ఎందుకు సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని అనుకుంటుందో కారణం మాత్రం చెప్పలేదు. కొంత కాలం అయితే సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని అనుకుంటున్న‌ట్టు తెలియ‌జేసిన ఫాతిమా.. ఫ్యాన్స్ అంద‌రు సుర‌క్షితంగా ఉండాల‌ని కోరింది.

ఫాతిమా ఇలా స‌డెన్‌గా సోష‌ల్ మీడియాకు దూరం ఎందుకు అయి ఉంటుంద‌ని అభిమానులు తెగ ఆలోచిస్తున్నారు. కార‌ణం క‌రోనా అయి ఉండొచ్చ‌ని బాలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. 2019లో ఫాతిమా పర్సనల్ రీసన్స్ వలన సోషల్ మీడియా నుండి విరామం తీసుకుంది. చ‌దువు మీద దృష్టి పెట్టేందుకు కొంత గ్యాప్ తీసుకున్న ఫాతిమా తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఆమెకు ఇన్‌స్టాగ్రాములో 2.5 మిలియన్స్ పైగా ఫాలోయింగ్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు వీడియోస్ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఫాతిమా.. దంగల్ సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది . ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది.

Advertisement