Bollywood: వ్య‌భిచార కూపంలో బాలీవుడ్ న‌టీమ‌ణులు..!

Bollywood: సినిమా ప‌రిశ్ర‌మ అంటే అదొక రంగుల ప్ర‌పంచంలా మ‌న‌కు క‌నిపిస్తుంటుంది. కాని వాటి వెన‌క ఎన్నో చీక‌టి కోణాలు ఉంటాయి. కొంద‌రిని ఆఫ‌ర్స్ కోసం బ‌ల‌వంతంగా వ్య‌భిచారంలోకి దింపుతుంటారు. ముంబై న‌గ‌రంలో అయితే సెక్స్ రాకెట్ మ‌రింత‌గా ఉంటుంది. తాజాగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ముంబైలోని ఓ ప్రాంతంలో ఐదుగురిని అరెస్ట్ చేయ‌గా, వారిలో ఇద్ద‌రు బాలీవుడ్ న‌టీమ‌ణులు ఉన్నారు. ఈ విష‌యం అంద‌రికి షాకింగ్‌గా మారింది. వివ‌రాల‌లోకి వెళితే ముంబై శివార్ల‌లో ఐదు ఎక‌రాల ఏరియా ఉండ‌గా, అక్క‌డ‌కు నిత్యం కార్లు వ‌స్తు పోతూ ఉంటాయి. దీనిపై అనుమానం వ‌చ్చిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాపు కాసి రైడ్ చేయ‌డంతో సెక్స్ రాకెట్ సీక్రెట్ రివీల్ అయింది.

Bollywoodప్రైవేట్ సొసైటీ లోనిఓ ఫ్లాట్‌లో సెక్స్ రాకెట్ నడుస్తోందని ప్రథాన క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. పోలీసుల‌కు దొరికిన వారిలో ఇద్ద‌రు బాలీవుడ్ న‌టీమ‌ణులు ఉండ‌గా, వారికి సినిమా అవ‌కాశాలు త‌గ్గిపోవ‌డంతో ఇలాంటి పనులకి సిద్ధ‌మ‌య్యార‌ట‌. లాక్‌డౌన్ లో ఖ‌ర్చులు చేశాము. ఇబ్బందులు పెరిగాయి. ఏం చేయోలో తెలియ‌క క‌ష్టాల నుండి బ‌య‌ట‌ప‌డేందుకు వ్య‌బిచార వృత్తిలోకి వెళ్లామ‌ని అమ్మాయిలు చెప్పుకొచ్చారు. అయితే ఇద్దరు అమ్మాయిలనూ ఈ ఉచ్చులోకి దింపిన అసలు ఏజెంట్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. త్వరలోనే అతన్ని పట్టుకుంటే… మొత్తం డొంక కదులుతుందని పోలీసులు అనుకుంటున్నారు.

Bollywood

ఈ సెక్స్ రాకెట్ చాలా హైటెక్ రేంజ్ కాగా, అరెస్టు సమయంలో… రూ.1.80 లక్షల చొప్పున ఇద్దరు అమ్మాయిలు డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. నిత్రాజ్ సొసైటీలో జరుగుతున్న తంతు స్థానికంగా కలకలం రేపింది. అరెస్టైన వారిలో ఇద్ద‌రు న‌టీమ‌ణుల‌తో పాటు మ‌హిళా ఏజెంట్స్, మ‌గ బ్రోక‌ర్ కూడా ఉన్నార‌ట‌. విటుల వివ‌రాలు తెలియాల్సి ఉంది.అయితే ఈ సొసైటీ తంతుకి సంబంధించి మరికొందరు సభ్యులు ఉన్నారనీ వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు. సైడ్ రోల్స్ చేసే ఈ ఇద్దరు అమ్మాయిలు. ప్పటి నుంచి ఈ వృత్తిలోకి దిగారు, వీళ్లతో ఇంకా ఎంత మంది అమ్మాయిలు జత కట్టారు వంటివి వివరాలు త్వరలో మీడియాకు చెబుతామని పోలీసులు తెలిపారు.

Bollywood