Bollywood: ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయ‌లేదంటున్న అందాల ముద్దుగుమ్మ‌

Bollywood: సినిమా అంటే చాలా మందికి ఒక ఎంటర్ టైన్ మెంట్. కానీ నటించే వారికి మాత్రం అది జీవితం. సినిమా అనే రంగుల ప్రపంచంలో తాము ఓ భాగం అవ్వాలని అనుకుంటారు. ఎందుకంటే వాళ్లకు సినిమానే ప్రపంచం. ఎంతోమంది సాఫీగా సాగిపోయే జీవితాన్ని, లైఫ్ స్టైల్ ను వదులుకుని మరి ఈ సినిమా ఫీల్డ్ కి వస్తున్నారు. సినిమా అంటే కేవలం యాక్టింగ్ అనుకుంటారు చాలామంది. కాని ఎంతో కష్టపడితే తప్ప ఫేమ్ రాదు. బరువు పెరగడం, తగ్గడం, వర్కౌట్ ఇలా ఎన్నో ఉంటాయి. ఒక్కో సినిమాకు తగ్గట్టుగా ఎన్నో రకాల విద్యలు నేర్చుకుంటారు.

ఈ క్రమంలో బాలీవుడ్ యాక్టర్ పరిణితి చోప్రా రీసెంట్ గా యాక్ట్ చేసిన సందీప్ ఔర్ పింకీ ప‌రార్ మూవీలో ఓ సీన్ కోసం తాను రెండు రోజులు స్నానం చేయ‌లేద‌ని చెప్పింది. మురికిగా ఉన్న ప్ర‌దేశంలో ప‌డుకున్నాన‌ని, మ‌రుస‌టి రోజు స్నానం చేయ‌కుండా అలాగే సెట్‌కు వ‌చ్చేశాన‌ని ఆమె చెప్ప‌డం విశేషం. ఈ సినిమాలో అనుకోని విధంగా గర్భ స్రావం జరగడం.. కొన్ని రోజుల పాటు ఆమె అదే షాక్‌లో ఉన్న సీన్లను స‌హ‌జంగా తెర‌కెక్కించ‌డానికే ఈ ప్రయత్నం.

ఈ సినిమాలో ఈ సీన్ గురించి ఇంటర్వ్యు లో తెలిపింది. కొండ ప్రాంతంలోని ఓ గుడిసెలో రెండు, మూడు రోజుల పాటు ఆ సీన్ షూటింగ్ జ‌రిగింది. నేను చెప్పేది వింటే ఎవ‌రు ఏమ‌నుకుంటారో తెలియ‌దు కానీ.. ఆ సీన్ కోసం నేను రెండు రోజులు స్నానం చేయ‌లేదనీ.. ఆ ప్రాంతం మొత్తం మురికిగా ఉండేది. షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్లే స‌మ‌యానికి నా ఒళ్లంతా బుర‌ద‌మ‌య‌మ‌య్యేది.

కానీ నేను అలాగే వెళ్లి మ‌రుస‌టి రోజు స్నానం చేయ‌కుండా షూటింగ్‌లో పాల్గొనేది అని ప‌రిణీతి చెప్పింది. అత్యంత స‌హ‌జంగా, మేక‌ప్ సాయం లేకుండా ఆ సీన్ ఉండేలా చూడ‌టానికే తాను ఇలా చేశాన‌ని పరిణితి తెలిపింది. ఈ సినిమా రీసెంట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సంపాదించుకుంది.