Ariyana: దూకుడు పెంచిన అరియానా.. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ

Ariyana: అవ‌కాశాన్ని ఎలా స‌ద్వినియోగం చేసుకోవాలో కొంద‌రికే తెలుసు. బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో కంటెస్టెంట్స్‌గా పార్టిసిపేట్ చేసిన చాలా మంది వ‌చ్చిన అవ‌కాశాల‌ని బాగానే స‌ద్వినియోగం చేసుకున్నారు.బిగ్ బాస్ త‌ర్వాత కొంద‌రు సీరియ‌ల్స్‌, సినిమాలు అంటూ ఫుల్ బిజీగా మారుతున్నారు. ఇంకొంద‌రు బిజినెస్‌ల‌లో స‌త్తా చాటుతున్నారు.

Bold Beauty Ariyana Starts New Business
Bold Beauty Ariyana Starts New Business

యాంక‌ర్, బిగ్ బాస్ ఫేం శ్రీముఖి ఇప్ప‌టికే బ్యూటీ ప్రొడక్ట్స్‌ విక్రయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. కొత్త బ్రాండ్‌ ‘లువీ’ అంటూ శ్రీముఖి నేతృత్వంలో ఈ బ్రాండ్‌ ఏర్పాటైంది. లువీ అంటే సంస్కృతంలో అందం అని అర్థం. తొలుత పర్‌ఫ్యూమ్స్‌ను ప్రవేశపెట్టి దశలవారీగా బ్యూటీ, గ్రూమింగ్, హెయిర్‌ కేర్‌ వంటి ఉత్పత్తులను లువీ స్టోర్లలో పరిచయం చేయ‌నున్నారు.

పర్‌ఫ్యూమ్స్, బ్యూటీ ప్రొడక్ట్స్‌ వాడకం పల్లెల్లోనూ పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఫ్రాంచైజీ ద్వారా నిరుద్యోగులకు తోడ్పాటు అందించాలన్నది నా ఆలోచన అంటూ శ్రీముఖి బిజినెస్ ప్రారంభించింది. ఇక ఇప్పుడు అదే బాట‌లో మ‌రో బిగ్ బాస్ భామ అరియానా ప‌య‌నిస్తుంది. ఒక‌ప్పుడు సాదా సీదా యాంక‌ర్‌గా ఉన్న అరియానా ఇప్పుడు టాప్ సెల‌బ్రిటీగా మారింది.

వ‌ర్మ పుణ్య‌మా అని అరియానాకు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. ఇటీవ‌ల ఆయ‌న‌తో చేసిన బోల్డ్ ఇంట‌ర్వ్యూతో అరియానా దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయింది. అయితే త‌న‌కు వ‌స్తున్న ఈ క్రేజ్‌ని స‌ద్వినియోగం చేసుకునే దిశ‌లో అరియానా బిజినెస్ స్టార్ట్ చేసింది. ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీకి సంబంధించి మహేష్ బాబు, సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ వ్యాపారాల్లో రాణిస్తుండగా తాజాగా అదే బాటలో వెళ్లేందుకు రెడీ అయింది బోల్డ్ యాంకర్.

అరియానా.. తాను కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నట్లు అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. ఆర్య ఈవెంట్ ప్లానర్స్ అనే సంస్థను ప్రారంభించానని, దానికి మీ అందరి సహకారం కావాలని కోరుతూ సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది అరియానా. ఇది చూసి ఆమెకు పెద్ద ఎత్తున కంగ్రాట్స్ చెబుతున్నారు నెటిజన్లు.