bola shankar: భోళా శంక‌ర్‌కి ముహూర్తం ఫిక్స్.. షూటింగ్ ఎప్పుడు మొద‌లు కానుంది అంటే..!

bola shankar: మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో దుమ్ము రేపుతున్నాడు. వ‌రుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల‌కు స‌వాల్ విసురుతున్నాడు. ఇప్ప‌టికే ఆచార్య షూటింగ్ పూర్తి చేసిన చిరు వ‌చ్చే నెల నుండి గాడ్ ఫాద‌ర్ షూటింగ్‌లో పాల్గొననున్నాడు. త‌న చేతికి చిన్న స‌ర్జ‌రీ కావ‌డం వ‌ల‌న షూటింగ్ వాయిదా వేశారు చిరు.

TheNewsQube-
Auspicious Day is Set for the MEGA LAUNCH
Auspicious Day is Set for the MEGA LAUNCH

కుడిచేత్తో ఏ పని చేసినా కష్టంగా ఉండేదని, తిమ్మిరిగా అనిపించేదని, దీనికి సర్జరీ చేయాలని వైద్యులు అన్నారంటూ చిరు చెప్పేశాడు. దాన్ని ‘కార్పల్ టన్నెల్ సిండ్రోమ్’ అంటారని డాక్టర్లు చెప్పారని చిరు తన అభిమానులకు అసలు విషయాన్ని వివరించాడు. చేతికి గాయం అవ్వడంతో గాడ్ ఫాదర్ షూటింగ్ కూడా వాయిదా వేసినట్టు చెప్పేశాడు.

ఇక మెహ‌ర్ ర‌మేష్ తెర‌కెక్కిస్తున్న భోళా శంక‌ర్ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొద‌లు కానుంద‌ని అంద‌రిలో అనుమానాలు నెల‌కొని ఉండ‌గా, దానిపై క్లారిటీ వ‌చ్చేసింది. మెగా మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు న‌వంబ‌ర్ 11 ఉద‌యం జ‌ర‌గ‌నున్నాయ‌ని, షూటింగ్ 15 నుండి మొద‌లు కానుంద‌ని పోస్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

Auspicious Day is Set for the MEGA LAUNCH
Auspicious Day is Set for the MEGA LAUNCH

తమిళంలో అజిత్ కి తిరుగులేని హిట్ ఇచ్చిన సినిమాకి రీమేక్ గా భోళా శంక‌ర్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు .

భోళా శంక‌ర్ సినిమాలో చిరంజీవితో పాటు ఆయన చెల్లెలుగా కీలకపాత్రలో కీర్తి సురేష్ నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా తమన్నా చేస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.