Bodyguard Salarie’s: విరుష్క దంప‌తుల బాడీగార్డ్స్ జీతాలు వేరే లెవ‌ల్లో ఉన్నాయి..!

Bodyguard Salarie’s: క‌రోనా మ‌హ‌మ్మారి సృష్టించిన ప్ర‌ళ‌యంతో అనేక మంది జీవితాలు అగ‌మ్య‌గోచ‌రంగా మారాయి. చాలా మంది రోడ్డున ప‌డ్డారు. పొట్ట‌కూటి కోసం అనేక ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. న‌టీన‌టులు కూడా జీవ‌నాధారం కోసం కూర‌గాయ‌లు అమ్మ‌డం, పండ్లు అమ్ముకోవ‌డం వంటివి చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర పని చేస్తున్న వారి ప‌రిస్థితి ఏంట‌నే దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తుంది.

Bodyguard salaries
Bodyguard salaries

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల ద‌గ్గ‌ర ప‌ని చేసే జీతాల‌కు సంబంధించి కొద్ది రోజులుగా ఆస‌క్తిక‌ర వార్త‌లు వ‌స్తున్నాయి. దీపికా బాడీగార్డ్, రామ్ చ‌రణ్ డ్రైవ‌ర్‌ల జీతాలు ఇవి అంటూ కొన్ని వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేశాయి. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీ, అనుష్క శ‌ర్మల బాడీ గార్డ్స్ జీతాల‌కు సంబంధించి వార్త‌లు షికారు చేస్తున్నాయి.

బాడీగార్డ్స్ సెల‌బ్రిటీల‌ని కంటికి రెప్ప‌లా చూసుకుంటారు. ఎక్క‌డ‌కి వెళ్లినా కూడా వారిపై ఈగ వాల‌కుండా చూసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. అలాంటి వారికి ఎంత ఇచ్చినా తక్కువే . అయితే విరుష్క దంప‌తులు తమ బాడీగార్డులకు ఏడాదికి గానూ ఎవరూ ఊహించని జీతం ఇస్తున్నారు. వాళ్లు ఇచ్చే జీతాలు కొన్ని కంపెనీల సీఈఓల కంటే ఎక్కువంటే నమ్మడం సాధ్యం కాదు. నెలకు లక్షలకు లక్షలు వాళ్లకు చెల్లిస్తున్నారు.

అనుష్క శ‌ర్మ త‌న బాడీ గార్డ్ ప్రకాశ్ సింగ్ ఝాను అన్న‌య్య‌లా చూసుకుంటుంది. విరాట్‌ను పెళ్లి చేసుకోకముందు నుంచి కూడా అనుష్కకు అంగ రక్షకుడిగా ఉన్నాడు. కోహ్లీతో పెళ్లి తర్వాత ఈ ఇద్దరూ ఎక్కడికి వెళ్లినా కూడా వెంటే ఉంటాడు ప్రకాశ్. అనుక్షణం వాళ్లను పబ్లిక్ నుంచి కాపాడుతుంటాడు. ఈయనకు అనుష్క శర్మ ఏడాదికి 1.2 కోట్ల జీతం చెల్లిస్తుందని తెలుస్తుంది.

కోహ్లీ కూడా త‌న బాడీ గార్డ్‌కి భారీగానే జీతాలు ఇస్తాడ‌ని తెలుస్తుంది. అనుష్క‌- విరాట్‌లు త‌మ ప‌ర్స‌న‌ల్ బాడీగార్డ్స్‌కు ఏడాదికి గాను రెండు కోట్లు చెల్లిస్తాడ‌ని టాక్. ఇక షారూఖ్ ఖాన్ కి ర‌వి సింగ్ అనే బాడీ గార్డ్ ఉండ‌గా, ఆయ‌న‌కు ఏడాదికి 2.5 కోట్ల జీతం ఇస్తున్నాడు షారుక్ ఖాన్. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అంగరక్షకుడి పేరు యువరాజ్ ఘోర్‌పడే. ఈయనకు ఏడాదికి 2 కోట్ల జీతం ఇస్తున్నాడు అమీర్ ఖాన్.

స‌ల్మాన్ ఖాన్ బాడీగార్డ్ పేరు షెరా. ఈయ‌న‌కు ఏడాదికి రెండు కోట్ల‌కు పైగానే చెల్లిస్తున్నాడు. ఇక అక్ష‌య్ కుమార్ బాడీ గార్డ్ పేరు ష్రెస్ సెయ్ . ఈయనకు ఏడాదికి 1.2 కోట్ల రూపాయలు జీతంగా ఇస్తున్నాడు అక్షయ్ కుమార్. ఇక అమితాబ్ బచ్చ