RAKUL PREET గ్లామర్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రకుల్ నటించిన చెక్ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా, వైష్ణవ్ తేజ్‌తో చేసిన చిత్రం త్వరలోనే థియేటర్స్‌కు రానుంది. మరోవైపు అజయ్ దేవగణ్‌తో ఓ చిత్రం, జాన్ అబ్రహంతో ఓ చిత్రం చేస్తుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ లక్ష్యరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎటాక్‌లో పాల్గొంటుంది. ఉత్తరప్రదేశ్‌లోని ధనిపూర్‌లో ఈ మూవీ జరుగుతుండగా, స్తానికులు చిత్ర బృందంతో అసభ్యంగా ప్రవర్తించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారింది.
ఎటాక్ సినిమా షూటింగ్లో భాగంగా జాన్ అబ్రహం యాక్షన్ సీన్స్ చేస్తుండగా, సడెన్ ఎక్స్ప్లోజన్ జరిగింది. అయితే చిత్రీకరణలో భాగంగానే ఇది చేయగా, చుట్టు పక్కల వారు ఏం జరిగిందా అని తెలుసుకోవడానికి భారీగా అక్కడికి చేరుకున్నారు. సెక్యూరిటీ వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన స్తానికులు రాళ్ళదాడి చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో సెక్యూరిటీ కొందరు గాయపడగా, రకుల్, జాన్ అబ్రహం సేఫ్‌గా తప్పించుకున్నారు. పోలీసుల చొరవతో వివాదం సద్ధుమణగడంతో షూటింగ్‌ను కొనసాగించారు. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఆగస్ట్ 13న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
రకుల్ రీసెంట్గా తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది. వివాహ వ్యవస్థను నేను ఎక్కువగా నమ్ముతాను. ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి నడిచే పవిత్ర బంధమే పెళ్లి అంటూ పెద్దపెద్ద పదాలే చెప్పింది ఈ బ్యూటీ. నన్ను చేసుకోబోయే వాడు నా కన్నా పొడుగు ఉండాలి. ఎంతలా అంటే నేను అతనిని తల ఎత్తి చూడాలి. హైహీల్స్ వేసుకున్నా కూడా అతనే పొడుగ్గా ఉండాలి.. దాంతో పాటు తెలివైన వాడై ఉండాలని కాబోయే భర్తకు కావాల్సిన లక్షణాలను చెప్పింది రకుల్. మరి రకుల్ చేసుకోబోయే వాడు ఎక్కడున్నాడో మరి.