Dil Raju : ‘దిల్’ రాజు మనవరాలి పుట్టినరోజు వేడుక : అల్లు అర్జున్, మంచు విష్ణు సందడి.!
NQ Staff - January 6, 2023 / 11:26 PM IST

Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు మానవరాలు ఇషిత పుట్టినరోజు వేడుక గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బర్త్ డే పార్టీకి టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అల్లు అర్జున్, మంచు విష్ణు సతీ సమేతంగా ఈ వేడుకకి హాజరై, చిన్నారిని ఆశీర్వదించారు.
యువ హీరోలు తేజ సజ్జ, నిర్మాతలు అల్లు అరవింద్, బండ్ల గణేష్, రచయిత బీవీఎస్ రవి, దర్శకులు మోహన కృష్ణ ఇంద్రగంటి, శైలేష్ కొలను తదితరులు ఈ వేడుకలో సందడి చేశారు.
సతీ సమేతంగా అల్లు అర్జున్..
కాగా, ఈ వేడుకలో అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహా రెడ్డి సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారారు. దిల్ రాజు – అల్లు అర్జున్ మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి.
సినీ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణఉ కూడా సతీ సమేతంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. దిల్ రాజు మనవడ్ని అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ముద్దాడుతున్న పొటోలు, అది చూసి దిల్ రాజు మురిసిపోతున్న వైనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.